హెడ్‌మాస్టర్ క్రూరత్వం.. చిన్నారుల కాళ్లు, చేతులు బెంచీలకు కట్టేసి.. - MicTv.in - Telugu News
mictv telugu

హెడ్‌మాస్టర్ క్రూరత్వం.. చిన్నారుల కాళ్లు, చేతులు బెంచీలకు కట్టేసి..

November 29, 2019

Headmaster cruelty.. Kids' legs and hands are tied to benches.

పాఠశాలలో పిల్లలు అల్లరిచేస్తే బుజ్జగించి చెప్పాల్సింది పోయి.. చిన్నారుల పట్ల అమానవీయంగా ప్రవర్తించాడో హెడ్ మాస్టర్ . చిన్నారులను క్లాస్‌రూమ్‌లో బెంచీలకు కట్టేశాడు. అనంతపురంలో కదిరి పట్టణంలోని మశానంపేట పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూల్లో అల్లరి చేస్తున్నారన్న కారణంతో ఇద్దరు చిన్నారుల పట్ల హెడ్ మాస్టర్ అమానుషంగా ప్రవర్తించాడు. విద్యార్థుల కాళ్లు, చేతులు బెంచీలకు కట్టేసి చిత్ర హింసలు పెట్టాడు. 

మళ్లీ అల్లరి చేయబోమని.. వదిలేయమని వేడుకున్నా ఆ మృగ టీచర్ వినలేదు. తోటి విద్యార్థుల ద్వారా విషయం బయటకు పొక్కడంతో తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి హెడ్‌మాస్టర్‌తో వాగ్వాదానికి దిగారు. మరోవైపు అతడి తీరుపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయన్ను విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.