వైసీపీ ఎమ్మెల్యే కాల్ రికార్డ్ బయటపెట్టిన హెచ్ఎంపై వేటు - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీ ఎమ్మెల్యే కాల్ రికార్డ్ బయటపెట్టిన హెచ్ఎంపై వేటు

October 26, 2019

Headmaster Suspension On Vidadala Rajini Issue.

చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ఫోన్‌కాల్ రికార్డు బయటపెట్టిన ఓప్రధానోపాధ్యాయురాలిపై సస్పెన్షన్ వేటు పడింది. విద్యాశాఖ కమిటీ ముందు తాను మాట్లాడిన మాటలను వినిపించిన ధనలక్ష్మీపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. దీంతో వెంటనే ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

శారదా హైస్కూల్ విద్యా కమిటీ ఏర్పాటులో వివాదం తలెత్తింది. దీనిపై కల్పించుకున్న ఎమ్మెల్యే రజిని ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మికి ఫోన్ చేశారు. వెంటనే కమిటీని రద్దు చేసి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు.  వెంటనే ఇదే విషయాన్ని హెచ్ఎం కమిటీకి తెలియజేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే తనతో ఫోన్‌లో మాట్లాడిన వాయిస్ రికార్డును వారికి వినిపించారు. ఈ విషయం వివాదస్పదం కావడంతో రజిని సీరియస్ అయ్యారు. తనకు తెలియకుండా కాల్ రికార్డు వినిపించిన హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని కోరడంతో ఆమెపై వేటు వేశారు.