Headphones cause damage to your ears
mictv telugu

ఇయర్ బడ్స్ వాడుతున్నారా ? తస్మాత్ జాగ్రత్త..

November 18, 2022

స్మార్ట్ ఫోన్స్ వచ్చాక మనుషుల మధ్య సంబంధాలు తగ్గిపోయాయి. పక్కన ఉన్నవారితో సైతం మాట్లాడటం మానేసి ఫోన్‌లో మునిగిపోతున్నారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, రీల్స్, సినిమాలు సిత్రాలు అంటూ కాలం గడిపేస్తున్నారు. చెవిలో ఇయర్ ఫోన్స్, ఇయర్‌బడ్‌లు పెట్టేసి పెద్ద సౌండ్‌లతో పాటలు విని డ్యాన్స్‌లు వేస్తున్నారు. ఇదే ఇప్పుడు సమస్యలకు దారి తీస్తోంది. ఇయర్‌ఫోన్స్‌ను ఎక్కువగా వాడేవారు చెవిటివారిగా మారే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.

హెడ్ ఫోన్స్‌లో ఎక్కువ సౌండ్ పెట్టి..అధిక సమయం విన్నవారు వినికిడిని కోల్పోయే ప్రమాదం ఉందని గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో వివరించింది. ఇప్పటికే 43 కోట్ల మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. సాధారణంగా 60 డెసిబుల్స్ కంటే తక్కువగా ఉంటే వినికిడి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. కాని ప్రతీ ఒక్కరు 105 dB వరకు వాల్యూమ్‌తో మ్యూజిక్‌ వింటున్నట్లు తాజా అధ్యాయనాలు చెబుతున్నాయి. ఇది ఇలా కొనసాగితే రానున్న రోజుల్లో మరింత మంది వినికిడి సమస్యలతో బాధపడనున్నారు. స్మార్ట్ ఫోన్, ఇయర్‌బడ్‌,హెడ్ ఫోన్స్‌ ల వాడకం కొంచెం తగ్గిస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.