Home > Featured > వారెవ్వా.. వాము తింటే ఇన్ని లాభాలా?

వారెవ్వా.. వాము తింటే ఇన్ని లాభాలా?

carom seeds.

వామును కొన్ని ప్రాంతాల్లో 'ఓమ' అని కూడా అంటారు. ఇది సాధారణంగా అన్ని వంటిళ్లలో కనిపించే దినుసు. వాము గింజలు ప్రత్యేకమైన సువాసన కలిగి ఉంటుంది. భోజనం జీర్ణం కాకపోతే 'కాసింత వాము వేడినీటితో కలిపి నమలవే. సమస్య తగ్గిపోతుంది' అనే అమ్మమ్మలు అనడం వినే ఉంటారు. ఆహరం అరిగించడంతో పాటు వాము అనేక ఆరోగ్య సమస్యలకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. వామును కూరలు, పరోటాలు, రొట్టెలు, పకోడిలలో వేస్తే రుచిని ఆరోగ్యాన్ని ఇస్తాయి.

* జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి వాము మంచి ఔషధం. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే జలుబు సమస్య తీరిపోతుంది.

* అజీర్ణం సమస్య ఉన్నవారు వాము, ఉప్పు, మిరియాలు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం సమస్య నుంచి విముక్తి పొందుతారు.

* వామును కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత సమస్యలు దూరమవుతాయి.

* వివిధ రకాల గుండెవ్యాధులు దరిచేరకుండా వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

* వయస్సు మళ్ళిన తరువాత సహజంగా వచ్చే కీళ్ళ నొప్పులను తగ్గించడంలో వాము ముఖ్య పాత్ర పోషిస్తుంది. వాము నూనెతో కీళ్లపై మర్దన చేస్తే కీళ్ల నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

* మద్యం తీసుకున్న తర్వాత పొట్టలో ఏర్పడే వికారాన్ని నియంత్రించేందుకు వాము ఉపయోగపడుతుంది.

* వామును దవడన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గరగర శబ్దాలు తగ్గుతాయి.

* వాము మూత్రకోశ వ్యాధులకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. వామును తరచూ తీసుకుంటే మూత్రపిండాలలో ఏర్పడే రాళ్లు కరిగిపోవడంలో సహకరిస్తుంది.

* వాము, బెల్లం కలిపి తీసుకుంటే ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపశమనం లభిస్తోంది.

* బహిష్టు నొప్పులతో బాధపడేవారు వామును పాలతో తీసుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది.

* వేయించిన వామును జీలకర్ర నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే ఎసిడిటీ తగ్గుముఖం పడుతుంది.

* గర్భవతులు తరచూ వాము తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వాము రక్తాన్ని శుభ్రపరచటమే కాక శరీరంలోని రక్తప్రసరణ సక్రమంగా సాగేలా సహకరిస్తుంది.

* వాము, జీలకర్ర, ధనియాలు ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.

* వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి నీరు వాంతులకు తక్షణ మందులా పనిచేస్తుంది.

Updated : 29 Aug 2019 3:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top