శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. పండ్ల అనేగానే యాపిల్, అరటి, బొప్పాయి, దానిమ్మ వంటివి గుర్తుకు వస్తాయి. కానీ డ్రాగన్ ఫ్రూట్ ఈ పండు గురించి చాలామందికి తెలియదు. డ్రాగర్ ఫ్రూట్ లో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందని ఈ మధ్యే కొన్ని నివేదికలు వెల్లడించాయి. డ్రాగన్ ఫ్రూట్ ను పిటాయా లేదా స్ట్రాబెర్రీ పియర్ అని కూడా పిలుస్తారు. దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఒకసారైన ఆహారంలో చేర్చుకోవల్సిందే. డ్రాగన్ ఫ్రూట్ తింటే డాక్టర్ అవసరం లేదని చాలామంది చెబుతుంటారు. మరి డ్రాగన్ ఫ్రూట్ లో ఉన్న పోషకవిలువల గురించి తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి:
కొంతమంది తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు. అలాంటి వారు రోగనిరోధకశక్తిని పెంచుకోవాలి. తరుచగా డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే అందులో విటమిన్ సి, నియాసిన్, విటమిన్ బి1, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ బ్యాక్టీరియా, వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు వారానికోసారి డ్రాగన్ ఫ్రూట్ తినేలా చూసుకోవాలి.
రక్తంలో చక్కర స్థాయిని కంట్రోల్ చేస్తుంది :
షుగర్ పేషంట్లకు డ్రాగన్ ఫ్రూట్ బెస్ట్ ఫ్రూట్. దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరం నుంచి అదనపు చక్కెరను కంట్రోల్లో ఉంచడంలో సహాయపడుతుంది.
జీవక్రియకు :
డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను సరిగ్గా ఉంచడంతోపాటు మలబద్ధకం ఉన్నవారికి ప్రయోజనం చేకూరుస్తుంది. కడుపునొప్పి, మలవిసర్జనలో ఇబ్బందులు, అజీర్తీ వంటి సమస్యలకు ఈ పండుతో చెక్ పెట్టవచ్చు.
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది :
డ్రాగన్ ఫ్రూట్ కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు సహాయపడుతుంది. చెడుకొవ్వును కరిగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఒమేగా 3, ఒమేగా 6 ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.