అరటి తొక్కను పారేస్తున్నారా? ప్లీజ్ ఇది చదవండి! - MicTv.in - Telugu News
mictv telugu

అరటి తొక్కను పారేస్తున్నారా? ప్లీజ్ ఇది చదవండి!

January 9, 2020

banana peels.

అరటిపండు తొక్కే కదా అని తీసి పారేయకండి. ఎందుకంటే దానితో చాలా ప్రయోజనాలున్నాయి. అరటి తొక్కలో అధిక శాతంలో విటమిన్లు, ఖనిజాలు, బి6 , బీ12, ఏ, సి విటమిన్లు, మాంగనీస్, పొటాషియం, పీచు పదార్ధాలు, ప్రొటీన్లు, మెగ్నీషియం, తదితర ప్రోటీన్లు ఉంటాయి. అరటి తొక్కలు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా మేలు చేస్తాయి. 

 

* అరటి తొక్కలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. తొక్కతో       మొటిమలపై రుద్దితే మొటిమలు తగ్గుతాయి. 

 

* ఎగ్‌‌వైట్‌‌లో అరటిపండు తొక్కతో గుజ్జుగా చేసి ముఖానికి పట్టిస్తే ముడతలు తగ్గుతాయి.

 

* నొప్పులు, వాపులు ఉన్న చోట అరటిపండు తొక్కను గుజ్జుగా చేసి దానికి వెజిటబుల్ ఆయిల్ కలిపి     మసాజ్ చేస్తే అవి తగ్గుతాయి. 

* సోరియాసిస్ వ్యాధితో వచ్చే దురదలతో బాధపడేవారు అరటిపండు తొక్క గుజ్జును దురదల   ప్రాంతంలో పట్టిస్తే ఉపశమనం ఉంటుంది.

 

* అలర్జీలు, దురదలు వచ్చేచోట అరటిపండు తొక్క గుజ్జును రాస్తే ఉపశమనం పొందవచ్చు.

 

* అరటి పండు తొక్కలో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని తగ్గిస్తాయి. 

 

* ఐరన్, మెగ్నిషియం, పొటాషియం తదితర పోషకాలు కూడా అరటి పండు తొక్కలో ఉంటాయి.   దీంతోపాటు మూడ్‌ను మార్చి డిప్రెషన్‌ను తగ్గించే సెరొటోనిన్ అనబడే సమ్మేళనం కూడా అరటి   పండు తొక్కలో ఉంటుంది.

 

* కాలినగాయాలు, పుండ్లు, దెబ్బలపై అరటి పండు తొక్కతో మర్దనా చేస్తే ఆయా గాయాలు త్వరగా   తగ్గుముఖం పడతాయి.

* అరటిపండు తొక్కతో దంతాలను తోముకుంటే దంతాలు తెల్లగా మారుతాయి.

 

* నీటిలో ఉండే లోహాలను, ఇతర విషపదార్థాలను తొలగించడంలోనూ అరటి పండు తొక్క మనకు   ఎంతగానో ఉపయోగపడుతుంది. నీటిలో అరటి పండు తొక్కలను వేస్తే నీరు శుభ్రంగా మారుతుంది.

 

* అరటి తొక్కలో ట్రిప్టోఫాన్ అనే రసాయనం ఉంటుంది. తొక్కను తింటే ఆ రసాయనం మన   శరీరంలోకి చేరుతుంది. అప్పుడు నిద్ర బాగా వస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అరటి   పండు తొక్కలను తింటుంటే ప్రయోజనం ఉంటుంది.

 

* అరటి తొక్కలో ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి   కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీని వల్ల గుండె సంబంధ సమస్యలు రావు.

 

* అరటి పండు తొక్క లోపలి భాగాన్ని తినడం వల్ల కంటిచూపు సంబంధ సమస్యలు తగ్గుతాయి. అరటి    తొక్కలో ల్యూటిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అతినీలలోహిత కిరణాల       ప్రభావం నుంచి కంటిని కాపాడుతుంది. లుటీన్ దృష్టి సమస్యలను పోగొడంతో పాటు రేచీకటి,      శుక్లాలు   రాకుండా చేస్తుంది.

 

* అరటి తొక్క పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది. కొత్తవి రాకుండా చేస్తుంది. పులిపిర్లు ఉన్న ప్రాంతాన్ని అరటితొక్కతో రుద్దండి లేదా ఆ ప్రాంతం మీద రాత్రంతా అరటితొక్కను కట్టండి. పులిపిర్లపై అరటి తొక్కను ఉంచి దానిపై బ్యాండ్ ఎయిడ్‌తో పట్టీలా వేయండి. ఇలా కొద్ది రోజులు చేయడం వల్ల పులిపిర్లు రాలిపోతాయి.