Health benefits of coriander water
mictv telugu

ధనియాల నీళ్లతో చర్మ సమస్యలు రావు!

November 16, 2022

భారతదేశంలోని పోపుల పెట్టెలో ధనియాలు ప్రధాన దినుసు. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియాలే ఈ దినుసును అధిక మోతాదులో వాడేలా చేస్తుందనడంలో సందేహం లేదు.
దక్షిణ భారతదేశంలోని సాంబార్, నార్త్ ఇండియాలోని ఫేవరెట్ రాజ్మా మసాలలో ఈ ప్రధాన దినుసు లేకుండా ఆ టేస్టే రాదండి. కేవలం వాసన కోసమే ధనియాలను వాడడం కాదు.. ఎంతో ఆరోగ్య ప్రదాయినిగా ఇది పని చేస్తుంది. చర్మ సమస్యలు, జుట్టు రాలడంలాంటి సమస్యలు తగ్గాలంటే మన రోజువారీ ఆహారంలో ధనియాలను చేర్చుకోవాల్సిందే! అంతేకాదు, క్యాన్సర్, మైగ్రేన్ మరికొన్ని రకాల సమస్యలకు కూడా చెక్ పెట్టేందుకు ధనియాలు ఉపయోగపడతాయని కొన్ని రీసెర్చ్లు కూడా చెబుతున్నాయి.

రోజూ గోరువెచ్చని నీటిలో ధనియాలు లేదా కొత్తిమీరను తరిగి వేసి మరిగించి తాగినా చాలా వరకు మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె సంబంధిత సమస్యలకు, క్యాన్సర్, ఆర్థరైటిస్కి కూడా ఈ ధనియాల నీళ్లు బాగా పనిచేస్తాయి. ధనియాలు ఐరన్ లోపానికి మెడిసిన్గా వాడుతారు. కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వడానికి కూడా ఇది బెటర్ ఆప్షన్. చక్కెర స్థాయిలు తగ్గడానికి ఈ నీటిని వాడొచ్చు. ధనియాల్లో.. విటమిన్ ఎ, సి, కె పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో వేడిని తీసేసి శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతేకాదు.. కిడ్నీ సమస్యలను కూడా అధిగమించొచ్చు. యాక్నే సమస్యలకు చెక్ పెట్టాలంటే ధనియాల నీళ్లు బాగా పనిచేస్తాయి. చర్మ సమస్యలు తగ్గడానికి ధనియాల నీళ్లు పనిచేస్తాయి. సీజనల్గా వచ్చే జ్వరం, వాంతులు, జలుబు ఈ సమస్యలకు ధనియాల నీళ్లు మంచి ఔషధం.

ధనియాల నీళ్లను ఎలా తయారు చేసుకోవాలో కూడా చదువండి. రెండు కప్పుల నీళ్లలో ఒక టేబుల్స్పూన్ ధనియాలను వేసి మరిగించాలి. సన్నని మంట మీద మరిగించాలి. సగానికి పైగా నీళ్లు అయ్యేంత వరకు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటిని వడగట్టి పెట్టాలి. ఈ నీళ్లను ఉదయం ఏం తినకముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది.