ఆరోగ్యానికి అక్క- దాల్చిన చెక్క.. ఇవీ లాభాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఆరోగ్యానికి అక్క- దాల్చిన చెక్క.. ఇవీ లాభాలు

August 7, 2019

health benefits cinnamon

మసాలాలలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకుంది దాల్చిన చెక్క. సుగంధ ద్రవ్యాల్లో కాస్త ఘాటు తక్కువగా వుండే చెక్క ఇది. దీని పరిమళం, రుచిని ఇష్టపడని వారు వుండరంటే అతిశయోక్తియే. దాల్చిన చెట్టు లోపలి బెరడునే దాల్చిన చెక్క అంటాం. చెట్టు నుంచి తీశాక అది గుండ్రంగా చుట్టుకొని గొట్టాలలాగా మారిపోతుంది. చెక్కతో చేసే టీ వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు వున్నాయి. దీనిని సేవించడం వల్ల బరువు తగ్గుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది, నెలసరి సమస్యలు తగ్గుతాయి, కడుపులో మంట తగ్గుతుంది, బీపీ కంట్రోల్‌లో వుంటుంది. అలాగే నడుము చుట్టూ రింగులా ఉండే కొవ్వు కరిగిపోవాలంటే దాల్చిన చెక్క టీ తాగితే ఫలితం వుంటుందని నిపుణులు చెబుతారు. వృద్ధాప్యం త్వరగా రాకుండా ఉండాలనుకుంటే ఈ టీ తాగితే ప్రయోజనం వుంటుంది. చర్మం, ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా ఉండాలంటే ఈ టీ తాగితే ప్రయోజనాలు బాగా ఉంటాయి.

మెదడు బాగా పనిచెయ్యాలన్నా, మతిమరపుకి చెక్ పెట్టాలన్నా దాల్చిన చెక్క టీ తాగాల్సిందే. ఎయిడ్స్‌కి కారణమయ్యే హెచ్ఐవీ వైరస్‌తో పోరాడే శక్తి కూడా దాల్చిన చెక్కకు ఉందని కొన్ని పరిశోధనల్లో తేలింది. దాల్చిన చెక్కతో తయారు చేసిన మసాజ్ ఆయిల్‌ను వాడటం వల్ల కూడా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇది యాంటీ-మైక్రోబియల్ గుణాలను కలిగి ఉండటంతో చర్మ సంరక్షణకి ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కను తేనెతో కలిపిన మిశ్రమాన్ని వాడటం వల్ల చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఇది యాంటీ-సెప్టిక్ గుణాలను కలిగి ఉండటంతో గాయాలు మానటానికి మందుగా వాడతారు. 

దాల్చిన చెక్క ‘సిన్నమాల్డిహైడ్’ వంటి సహజ సిద్ధమైన రసాయనాలను కలిగి ఉంటుంది. ఈ రసాయనాలు స్త్రీలలో ‘ప్రోజేస్టిరాన్’ ఉత్పత్తిని పెంచి, ‘టెస్టోస్టిరాన్’ ఉత్పత్తిని తగ్గించి శరీరంలో హార్మోన్ విడుదలను సమన్వయ పరచి, పరిపక్వతను తొందరగా అయ్యేలా చేస్తుంది.

దాల్చిన చెక్కతో ప్రయోజనాలు..

 

కొవ్వు తగ్గిస్తుంది :

Image result for cholesterol

దాల్చిన చెక్క, తేనె మిశ్రమం శరీరంలో కొవ్వును తగ్గిస్తాయి. ఒక చెంచా తేనె మరియు చిటికెడు దాల్చిన చెక్క పొడిని టీలో కలుపుకొని తాగటం వల్ల శరీరంలోని చెడుకొవ్వును బయటకు పాలద్రోలుతుంది. ఒక చెంచా తేనె మరియు చిటికెడు దాల్చిన చెక్క మిశ్రమాన్ని, గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగటం వల్ల శరీరంలో పెరిగే కొవ్వుని తగ్గిస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారు అల్పాహారానికి ముందు ఖాళీ కడుపున, రాత్రి పడుకోవటానికి ముందు ఈ మిశ్రమాన్ని తాగాలి.

జీర్ణాశయ సమస్యకు :

Image result for digestive system

జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు వుంటే విధిగా దాల్చిన చెక్కను చికిత్సగా వాడతారు. పచ్చి దాల్చిన చెక్కని తినటం వల్ల, కడుపులోని గ్యాస్‌ను తొలగిస్తుంది. 

చిగురు సమస్యలకు :

Image result for gums

పంటి చిగురు సమస్యలకు దాల్చిన చెక్క మంచి మందులా పనిచేస్తుంది. హానికర బాక్టీరియా వల్ల వచ్చే చిగురు సమస్యలకు దాల్చిన చెక్క ఉపశమనం కలిగిస్తుంది. దీనిని చూఇంగ్ గమ్స్, టూత్-జెల్స్ మరియు బ్రీత్-మింట్స్‌, మౌత్ వాషెస్‌ల తయారీలో వాడుతారు.

గుండెకు రక్షణ :

Related image

దాల్చిన చెక్క గుండెకి సంబంధించిన వ్యాధులు లేదా డయాబెటిస్ రావటంలో 23 శాతాన్ని తగ్గిస్తుందని ‘Centre for Applied Health Sciences in Fairlawn‘ వాళ్ళు వెల్లడించారు. దాల్చిన చెక్క- నీరు మిశ్రమం యాంటీ-ఆక్సిడెంట్‌లను కలిగి ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అరికడుతుంది.

క్యాన్సర్‌తో పోరాడుతుంది :

Image result for Cancer

కాన్సర్ కారకాలతో దాల్చిన చెక్క బాగా పోరాడుతుంది. శరీరంలో అవి వ్యాప్తి చెందకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. రోజు ఒక సగం చెంచా దాల్చిన చెక్క తీసుకోవటం వల్ల, కాన్సర్ నుంచి రక్షణ పొందొచ్చు. 

జుట్టు సమస్యలకు :

Image result for hair fall

జుట్టు రాలడం లేదా బట్టతలతో బాధపడేవారికి దాల్చిన చెక్క ఉపయుక్తమవుతుంది. వేడి ఆలివ్ నూనెలో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ దాల్చినచెక్క పొడిని కలిపి తలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి వెంట్రుకలు బాగా పెరుగుతాయి.