ఎండల్లో పుదీనా తప్పకుండా తీసుకోవాలి.. ఎందుకంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎండల్లో పుదీనా తప్పకుండా తీసుకోవాలి.. ఎందుకంటే..

April 3, 2019

ఏప్రిల్ నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. జనం బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. వేడిగాలులు, ఉక్కపోత, చెమటతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇలా ఇబ్బంది పడకుండా  రోజంతా.. ఫ్రెష్‌గా ఉండేదుకు పుదీనా ఎంతో ఉపయోగపడుతుంది.

ఉదయం లేవగానే ఒక గ్లాస్ నీళ్లలో పుదీనా ఆకులను వేసుకుని తాగితే రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు సలాడ్స్, డ్రింక్స్‌లో కూడా పుదీనా వేసుకుని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు. పుదీనాతో ఎండాకాలంలో ఎదురయ్యే అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయొచ్చు. ఎలా అంటే..

Health Benefits Of Drinking Mint Water In Summer.

ఇలా చేస్తే చర్మం రంగులో మార్పులు..

చాలామంది ఎండాకాలంలో బయట తిరిగి వచ్చే సరికి చర్మం రంగు చాలా మారిపోతుంది. అయితే ఇంటికి వెళ్లగానే చర్మం ఈ పని చేస్తే చర్మం రంగులో తక్షణ మార్పులు వస్తాయి. ఒక గాజు జార్ తీసుకుని పుదీనా ఆకులు, నిమ్మాకాల ముక్కలు, దోసకాయం లేదా వాటర్ మిలాన్ ముక్కలు, కొంచెం అల్లం తురుము కలుపి, మింట్ వాటర్ తయారు చేసుకుని ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి. దాన్ని ప్రతి రోజు తీసుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

అలాగే సమ్మర్‌లో ఎక్కువ మందికి జీర్మక్రియ సమస్యలు ఎదురవుతుంటాయి. దీనికి చక్కటి పరిష్కారం పుదీనా. దీంతో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్లు ఎక్కువగా ఉండటం వల్ల పొట్టలో జీర్ణ సమస్యలను నివారించుకోవచ్చు. అందేకాదు ఎండాకాలంలో వాంతులు, వికారం సమస్యలు నుంచి ఉపశమనం పొందొచ్చు. ముఖ్యంగా గర్భిణులు ఎండాకాలంలో మింట్ వాటర్ తీసుకోవడం ద్వారా నిరసం కోల్పోయి, శక్తి లభిస్తోంది. దీని వల్ల ఆస్తమా పేషంట్స్ రిలాక్సేషన్ ఇస్తుంది. శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

రుతుక్రమ సమస్యలు :

వేసవిలో అమ్మాయిలకు రుతుక్రమ సమస్యలు ద్వారా చాలా ఇబ్బందులు ఎందుర్కొంటుటారు. విపరీతమైన కడుపునొప్పి, బ్లీడింగ్ కారణంగా చిరాకు పడుతుంటారు. అలాంటి సమస్య ఎదురైన అమ్మాయిలు ఎక్కువగా మింట్ వాటర్ తీసుకుంటే.. రుతుక్రమ సమయంలో వచ్చే సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

ఇమ్యునిటీ :  

ఎండాకాలంలో జంక్ ఫుడ్స్, రోడ్ సైడ్ జ్యూస్‌లు, కూల్ డ్రింగ్స్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా అవుతాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ఉదయం లేవగానే ఒక గ్లాస్ మింట్ వాటర్ తీసుకోవడం వల్ల మీ ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి, ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. అలాగే ఒత్తిడి, డిప్రెషన్‌ను కూడా పుదీనా మార్చేసి మనుషులను ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండే‌లా చేస్తుంది.