వేసవి కాలంలో పెరుగు తినేందుకు చాలామంది ఇష్టపడతారు. అయితే చలికాలంలో పెరుగు తినేందుకు అంతగా ఆసక్తి చూపరు. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉండటంతో జలుబు, దగ్గు సోకుతుందన్న భయంతో దూరంగా ఉంటారు. పెరుగులో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది మీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగు తినడం వల్ల శరీరంలోని ఎముకలు దృఢంగా మారడంతో పాటు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనితో పాటు, పెరుగు ఎసిడిటీ, ఉబ్బరం, గ్యాస్ నుండి రక్షించడానికి కూడా పనిచేస్తుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి.
పెరుగులో అనేక పోషకాలు:
చలికాలంలో పెరుగు తినకూడదన్న అపోహలపై పోషకాహార నిపుణులు తొలగించారు. కాల్షియం, ప్రొటీన్, విటమిన్ బి12, విటమిన్ బి-2, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పెరుగులో లభిస్తాయి. లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్, లాక్టోకోకస్ లాక్టిస్ క్రెమోరిస్ వంటి మంచి బ్యాక్టీరియా వంటి మంచి నాణ్యమైన ప్రోటీన్లు కూడా ఇందులో ఉన్నాయి.
చలికాలంలో పెరుగు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు:
పొట్ట సంబంధిత సమస్యలకు పెరుగు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను సరిచేస్తుంది. శరీరంలోని pH బ్యాలెన్స్‌ని కూడా నిర్వహిస్తుంది. ఇది కడుపులో యాసిడ్ ఏర్పడకుండా చేస్తుంది. పెరుగు ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మం పొడిబారకుండా చేస్తుంది. ఇది సహజమైన మాయిశ్చరైజింగ్ భాగాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తుంది. జీర్ణకోశ సమస్యల మొటిమలు వచ్చే అవకాశం ఉన్నవారు. పెరుగు తీసుకోవడం వారికి కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. పెరుగులో ఉండే విటమిన్ సి జలుబు, దగ్గుకు మంచి ఔషధం. పెరుగులో విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి.
అందుకే చలికాలంలో పెరుగు తినడం మంచిదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ఎలాంటి అపోహలను నమ్మకుండా..క్రమం తప్పకుండా పెరుగును ఆహారంలో చేర్చినట్లయితే..పైన పేర్కొన్న ఆరోగ్య ప్రయోజనాలన్నింటినీ పొందవచ్చు.