యాలకులతో  పురుషులకు ఎన్ని లాభాలంటే! - MicTv.in - Telugu News
mictv telugu

యాలకులతో  పురుషులకు ఎన్ని లాభాలంటే!

July 10, 2019

భారతదేశం సుగంధ ద్రవ్యాలకు పుట్టినిల్లు. వేల సంవత్సరాలుగా భారత్ ప్రపంచవ్యాప్తంగా సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసే దేశాలలో అగ్రగామిగా సాగుతోంది. భారత్ ఎగుమతి చేసే సుగంధ ద్రవ్యాలలో యాలకులు ఒకటి. సుగంధ ద్రవ్యాల్లో రాణిగా చెప్పుకున్నే యాలకులు… ప్రపంచంలో ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో మూడోవి. కుంకుమపువ్వు, వెనీలా మాత్రమే యాలకుల కంటే ఖరీదైనవి. యలకులలో చాలా రకాలున్నాయి. వీటిని మనదేశంతోపాటు భూటాన్, నేపాల్, ఇండొనేసియాలోనూ పండిస్తారు. 

health benefits of elaichi or cardamom.

యాలకుల్లో ప్రధానంగా ఆకుపచ్చ, నలుపు అనే రెండు రకాలుంటాయి. ఎక్కువగా వాడేవి ఆకుపచ్చ యాలకులు.

* యాలకులు సంతాన సాఫల్యత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలోని సినియోల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది పురుషుల్లో నరాలను బలపరచుతుంది. రోజూ చిటికెడు యాలకుల పొడి వాడితే సంతాన సామర్థ్యం పెరుగుతుంది. నరాల బలహీనత ఉన్నవారు, లైంగిక సామర్ధ్యం తక్కువగా ఉన్నవారు రోజూ యాలకులు వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

* యాలకుల్లో మెటబాలిజంను మెరుగుపరిచే ఔషధ గుణాలున్నాయి. ఇవి జీర్ణక్రియను బలపరుస్తాయి. అలాగే కడుపులో మంట, నొప్పిని పోగొడతాయి. పొట్టలో విడుదలయ్యే బైల్ యాసిడ్‌ను యాలకులు క్రమబద్ధీకరిస్తాయి. 

* కొంతమంది బాధల్ని తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. ఆత్మహత్యకు కూడా పాల్పడుతుంటారు. ఇలాంటి ఆలోచనల నుంచీ మనల్ని యాలకులు కాపాడగలవు. ప్రతి రోజూ యాలకుల టీ తాగితే డిప్రెషన్ తగ్గుతుంది.

* కఫం, దగ్గు, ఊపిరాడకపోవడం, రొమ్ము దగ్గర పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు యాలకుల్ని క్రమంగా వాడాలి. ఇవి రక్త ప్రసరణను తేలిక చేసి ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి. కఫాన్ని కూడా తగ్గిస్తాయి. ఆకుపచ్చ యాలకుల్ని ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యల్ని నయం చేయడానికి ఉపయోగిస్తారు.

Related image

* యాలకుల్లో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. అది డయాబెటిస్ ప్రమాదం నుంచీ కాపాడుతుంది. ఈ దిశగా మరిన్ని ప్రయోగాలూ, పరిశోధనలూ జరుగుతున్నాయి.

* బీపీని తగ్గించేందుకు యాలకులు బాగా పనిచేస్తాయి. సూప్స్, బేకింగ్ పదార్థాలలో యాలకుల పొడి వేస్తుంటారు. యాలకులు రక్తపోటుని కంట్రోల్‌లో ఉంచుతాయి.

* కాన్సర్‌ను సహజ సిద్ధంగా తగ్గించే గుణాలు యాలకులకు ఉంటాయి. కాన్సర్‌ను అడ్డుకోవడం, అది వస్తే, త్వరగా పెరగకుండా చెయ్యగలగడం, కాన్సర్‌ను తగ్గించే లక్షణాలు కూడా యాలకులకు ఉన్నాయని జంతువులపై జరిపిన చాలా పరిశోధనల్లో వెల్లడైంది.  

* యాలకుల రుచి, సువాసన మనలో టెన్షన్, గుండె నొప్పి, ఉద్రేకతలను తగ్గిస్తాయి. అందువల్ల ఒత్తిడిలో ఉన్నవారు యాలకుల టీ లేదా పాలలో తాగితే మంచిది. యాలకుల గింజలు తిన్నా కూడా ప్రయోజనం ఉంటుంది. 

* యాలకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు గుండెకు మేలు చేస్తాయి. వీటిలోని ఫైబర్, ఇతర పోషకాలు కొలెస్ట్రాల్ లెవెల్‌ను తగ్గిస్తాయి. గుండెకు చక్కగా రక్తం సరఫరా అయ్యేలా చేస్తాయి.

Image result for health-benefits-of-elaichi-or-cardamom