Health benefits of turmeric in winter season
mictv telugu

చలికాలం ఆరోగ్యం పదికాలాలు ‘పచ్చ’గా ఉండాలా?

November 15, 2022

పసుపు కూరకు పచ్చదనాన్ని తీసుకురావడమే కాదు.. అందులో ఎన్నోఔషధ గుణాలు కూడా ఉంటాయి. దాంతో మనలోని రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పసుపుతో ఈ చలికాలాన్ని ఎలా జయించొచ్చో ఒకసారి చదివి చూడండి.. పసుపుని కొన్ని శతాబ్దాలుగా మన భారతదేశంలో వంటల్లో వాడుతున్నారు. ప్రపంచమంతా దీని వాడకం అంటూ ఉందడండోయ్.

 

ఇప్పుడంటే ప్యాకెట్లలో దొరుకుతుంది, కానీ ఒకప్పుడు పసుపుకొమ్ములు తీసుకొని దాన్ని ఎండబెట్టి మరి పట్టించేవారు. అసలు పసుపు లేని వంటను మన భారతీయులు ఊహించగలరా? అందుకే ఈ ఔషధాన్ని వంట ఇంటిలోనే దాచారు మన ఆడవాళ్లు. దగ్గు, జలుబు వచ్చినపుడు పసుపును వాడడం తెలుసు. కానీ ప్రత్యేకంగా ఈ చలికాలం ఎలా చేస్తే ఈ పసుపుతో మరిన్ని లాభాలు పొందాలో తెలుసుకోండి.

‌‌1. పాలల్లో పసుపు వేసుకోవడం వల్ల ఈ చలికాలం ఎన్నో లాభాలు పొందొచ్చు. చలికాలంలో వచ్చే ఒళ్లునొప్పులు, జలుబు, దగ్గు, ఇతర ఎలాంటి రకమైన జబ్బులనైన ఈ పసుపు పాలు నయం చేస్తాయి.

2. చలికాలం చర్మం మొత్తం పగిలిపోతుంది. ముఖ్యంగా యాక్నే సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు పాలు, తేనె, పసుపు కలిపి ముఖానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ ప్యాక్ వేశాక ఒక అరగంట పాటు అలాగే ఉంచి ఆ తర్వాత కడిగేయాలి. అప్పుడే చర్మం పగులకుండా కాపాడుకోవచ్చు. యాక్నే సమస్య కూడా క్రమంగా పెరిగిపోతుంది.

3. చుండ్రు సమస్య ఈ కాలం మరింత పెరుగుతుంది. అలాంటి సమయంలో ఆలివ్ లేదా కొబ్బరినూనె లేదా జోజోబా ఆయిల్లో పసుపు వేసి కలుపాలి. ఆ తర్వాత దాన్ని మృదువుగా జుట్టుకు రాసి కాసేపు వదిలేయాలి. కనీసం పావుగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. వారంలో ఒక రోజు ఇలా చేస్తే మంచి ఫలితం పొందొచ్చు.

4. ఏ కాలంలోనైనా ఒక కప్పు చాయ్ తాగకుండా రోజు గడవలేని వారు ఉంటారు. సాయంత్రం ఒక కప్పు చాయ్ సిప్ చేస్తే ఆ మజానే వేరు. అలాంటి వారు కప్పు చాయ్లో చిటికెడు పసుపు వేసుకొని తాగి చూడండి. మీలోని రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుంది.

5. కప్పు నీళ్లలో చిటికెడు పసుపు వేసి మరిగించి అందులోనే కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగండి. ఇది ఈ చలికాలం ఒక మంచి ఔషధంలా పని చేస్తుంది.