మెంతికూరలో అంతులేని పోషకాలు..పోతయట రోగాలు..! - MicTv.in - Telugu News
mictv telugu

మెంతికూరలో అంతులేని పోషకాలు..పోతయట రోగాలు..!

August 10, 2017

మెంతికూర తింటే కొందరు జుట్టుకు మంచిదంటరు,ఇంకొందరు షుగర్ లెవల్స్ తగ్గిస్తయంటరు,కనీ అవ్వే గాదు మెంతికూరలో ఎన్నెన్ని రోగాలు తక్కువయతో తెలిస్తే ఇప్పటిసుంచి అందరు మెంతికూరనే తింటర్ గావచ్చు.లివర్ సమస్యలుంటే మెంతికూర తింటే సమస్య తీరిపోతదట,డయేరియాకు చక్కని మందుగా పనిచేస్తుందట. శ్వాసకోశ సమస్యలు మాయమవుతాయట మెంతికూరతోని.చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందట. మెంతి ఆకులను నీళ్లల్ల రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగితే ఆరోగ్యంగ ఉంటమట.హార్ట్ అటాక్ఇతర గుండె సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో గుడ మెంతి కూర బాగా పనిజేస్తదట.అబ్బ మెంతికూరతోని గిన్ని లాభాలు ఉన్నయని ముందే తెలిస్తే రోజు అదే తిందుము అని అన్కుంటున్నరు గదా శానమంది.