నిలకడగా రాజశేఖర్ ఆరోగ్యం! - MicTv.in - Telugu News
mictv telugu

నిలకడగా రాజశేఖర్ ఆరోగ్యం!

October 24, 2020

Health bulletin Rajasekhar’s condition stable.jp

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్ అవసరం లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని పేర్కొన్నారు. మరోపక్క రాజశేఖర్ సతీమణి జీవితకు కరోనా నెగిటివ్‌గా తేలడంతో ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా, రాజశేఖర్ కుటుంబం ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చికిత్స పొందుతున్నారు. 

కుటుంబ సభ్యుల్లో రాజశేఖర్‌కు కరోనా ప్రభావం ఎక్కువ ఉండటంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. రాజశేఖర్‌కు లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ ఏర్పడటంతో శ్వాసతీసుకోవడంలో సమస్య ఏర్పడిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయన పెద్ద కుమార్తె శివాని తన తండ్రి కోసం ప్రార్ధన చేయండి అంటూ అభిమానులను ట్విటర్‌లో కోరిన విషయం తెలిసిందే.