హార్ట్‌‌ఎటాక్ మగవాళ్లకే.. ఆడవారికి ఎందుకు రాదో తెలుసా.. - MicTv.in - Telugu News
mictv telugu

హార్ట్‌‌ఎటాక్ మగవాళ్లకే.. ఆడవారికి ఎందుకు రాదో తెలుసా..

November 12, 2022

ఈ మధ్య కాలంలో దేశంలో గుండెపోటుతో చనిపోతున్న కేసులు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అకస్మాత్తుగా గుండెనొప్పితో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పునీత్ రాజ్ కుమార్, రాజు శ్రీవాస్తవ, సిద్ధాంత్ సూర్యవంశీ వంటి సినీ ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. వీరేకాక, సాధారణ ప్రజలు కూడా గుండెనొప్పికి గురయి చనిపోతున్న సంఘటనల వీడియోలు చాలా వచ్చాయి. అయితే వీటన్నింటిలో కామన్ విషయం ఏంటంటే.. గుండె నొప్పితో కేవలం మగవారే చనిపోతున్నారు.

ఆడవారు ఒక్కరు కూడా లేరన్న విషయం చాలా మంది గమనించలేదు. ఈ నేపథ్యంలో గుండెనొప్పి మగవాళ్లకే ఎందుకొస్తుంది, ఆడవాళ్లకు ఎందుకు రాదనే అంశంపై ఆరోగ్య నిపుణులు చెప్తున్న కారణాలు ఇలా ఉన్నాయి. మహిళల్లో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌‌ని అదుపులో ఉంచుతుంది. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇక మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, సిక్స్ ప్యాక్ మోజులో పడి స్టెరాయిడ్లు తీసుకోవడం, ఎలాంటి కారణం లేకుండా ఒత్తిడికి గురి కావడం, ఫిట్‌‌గా ఉండేందుకు వైద్యుల సలహా లేకుండా అధిక ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం వంటివి గుండెపోటు ప్రమాదాన్ని 40 శాతం పెంచుతుంది. దీనికి తోడు జిమ్‌‌లో అధిక వ్యాయామంతో గుండె ధమనులు బ్లాక్ అయి మరణాలకు దారి తీస్తోంది. అయితే ఆడవారికి అసలు గుండె పోటు రాదా అంటే మోనోపాజ్ దశకు వచ్చిన తర్వాత వచ్చే అవకాశముందని చెప్తున్నారు. ఆ సమయంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తక్కువ అవడమే అందుకు కారణమని స్పష్టం చేస్తున్నారు.