ప్రతి పేదకుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య భీమా.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రతి పేదకుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య భీమా..

February 1, 2018

ప్రజారోగ్యాని సర్కారు అరకొర నిధులు కేటాయిస్తోందన్న విమర్శల నేపథ్యలో కేంద్రం తాజా బడ్జెట్లో తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి కీలక పథకాన్ని ప్రకటించింది. దేశంలోని ప్రతి పేద కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

దీని ద్వారా దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాలకు..అంటే  50 కోట్లమందికి ఆరోగ్యానికి రక్షణ కలుగుతుందని, ఏడాదికి రూ.330 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమమని అన్నారు. అలాగే ప్రతి పౌరుడికి చేరువలో వెల్ నెస్ కేంద్రాల ఏర్పాటుకు కోసం రూ. 1200 కోట్లు కేటాయింమన్నారు.  యుష్మాన్‌భవ సహా పలు ఆరోగ్య కార్యక్రమాలు, పథకాలను పరిపుష్టం చేస్తామని చెప్పారు.