'ఆరోగ్య మహిళ' పథకాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు - Telugu News - Mic tv
mictv telugu

‘ఆరోగ్య మహిళ’ పథకాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

March 8, 2023

Health Minister Harish Rao launched the Arogya Mahila Scheme in Karimnagar.

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం పుర‌స్క‌రించుకొని ఆరోగ్య మ‌హిళా ప‌థ‌కాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు క‌రీంన‌గ‌ర్ జిల్లాలో బుధ‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. మ‌హిళ‌ల కోసం ఆరోగ్య మ‌హిళ అనే కొత్త ప‌థ‌కాన్ని తీసుకొచ్చామ‌ని తెలిపారు. ఆరోగ్య మ‌హిళ ప‌థ‌కంలో 8 ర‌కాల చికిత్స‌లు అందుబాటులో ఉంటాయ‌న్నారు. ఈ ప‌థ‌కం కింద 100 ఆస్ప‌త్రులు ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆరోగ్య మ‌హిళా కేంద్రాల్లో మ‌హిళా సిబ్బంది మాత్ర‌మే ఉంటార‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

మ‌హిళ‌ల సంక్షేమ కోసం ఆరోగ్య ల‌క్ష్మి, క‌ల్యాణల‌క్ష్మి, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని తెలిపారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం దేశంలో ఎక్క‌డా లేని విధంగా షీ టీమ్స్ ఏర్పాటు చేశామ‌న్నారు. మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం అమ‌లు చేసి ఆడ‌బిడ్డ‌ల‌కు నీటి క‌ష్టాలు తీర్చామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.