నల్గొండ ఆశా వర్కర్ల సభలో క్రైస్తవ ప్రార్థనలు .. రచ్చరచ్చ - MicTv.in - Telugu News
mictv telugu

నల్గొండ ఆశా వర్కర్ల సభలో క్రైస్తవ ప్రార్థనలు .. రచ్చరచ్చ

December 4, 2019

Nalgonda

ప్రభుత్వ సమావేశాలను కూడా కొందరు అతిగాళ్లు మత ప్రచారానికి వాడుకుంటున్నారు. నల్గొండ మండలం రాములబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు ఆశా కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారి క్రైస్తవ ప్రార్థనలు చేయించడంతో అందరూ షాక్ అయ్యారు. డీఎమ్‌హెచ్ఓలో సీనియర్ అసిస్టెంట్‌గా  శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. అతనికి రాములబండ పీహెచ్‌సీ ఆరోగ్య కేంద్రం ఇన్‌ఛార్జి బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రతి నెల మొదటి మంగళవారం పీహెచ్‌సీ పరిధిలోని ఏఎన్ఎమ్, ఆశావర్కర్ల సమీక్షా సమావేశం ఉంటుంది. ఈ సందర్భంగా అందరినీ రోటా వైరస్‌ కో-ఆర్డినేషన్ మీటింగ్‌కు రావాల్సిందిగా శ్రీనివాస్‌ చెప్పారు. అందరూ అక్కడికి వెళ్లారు. సమావేశంలో ఒక్కసారిగా బైబిల్‌ గ్రంథం పఠనం మొదలయ్యే సరికి ఉద్యోగులంతా షాక్‌‌కు గురయ్యారు.

నల్గొండ మండలం రాములబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు జరిగిన ఆశ కార్యకర్తల సమీక్షా సమావేశంలో క్రైస్తవ ప్రార్థనలు చేయించిన సూపర్వైజర్…….ఈ దెబ్బక్ తెలంగాణ గవర్నమెంట్ ఫ్లాష్ ఫ్లాష్..ఆశ కార్యకర్తలతో నల్లగొండ మండలం రాములబండ పిహెచ్సిలో మత ప్రార్థనలు చేయించిన టువంటి పిహెచ్సి ఇన్చార్జ్ శ్రీనివాస్, సూపర్వైజర్ లూరుదు మేరీ లను డిఎంహెచ్ఓ కొండలరావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Posted by Rajanikanth Pabba Gupta on Wednesday, 4 December 2019

ఈ వ్యవహారాన్ని కొందరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బలవంతంగా ఇలా క్రైస్తవ ప్రార్థనలు చేయించడం ఏంటని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌ తన పేరును ప్రభుదాసుగా మార్చుకుని.. పాస్టర్‌గా అవతారమెత్తారు. కల్వరీ మిరాకిల్‌ మినిస్ట్రట్‌ నిర్వహిస్తున్నారు. అయితే.. ఇంత జరుగుతున్నా.. జిల్లా వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అలసత్వం వహించడంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మత ప్రార్థనలు చేయించిన పీహెచ్‌సీ ఇన్‌ఛార్జ్ శ్రీనివాస్, సూపర్‌వైజర్ లూరుదు మేరీలను డీఎంహెచ్ఓ కొండలరావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.