అరచేతిలో ఆరోగ్య రిపోర్ట్‌: హరీష్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

అరచేతిలో ఆరోగ్య రిపోర్ట్‌: హరీష్ రావు

May 12, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి అరచేతిలో ఆరోగ్య వివరాలను తెలుసుకునేలా కేసీఆర్ సర్కార్ డయాగ్నోస్టిక్స్ వ్యక్తిగత ఆరోగ్య రిపోర్ట్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌తో పాటు టి-డయోగ్నోస్టిక్స్ మినీ హబ్‌ను బుధవారం హైదరాబాద్‌లోని నార్సింగిలో హరీశ్ రావు ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా మరింత సేవలు పొందడమే కాకుండా, రోగి వ్యక్తిగత వైద్య వివరాలు భద్రంగా ఉంటాయని ఆయన తెలిపారు.

హరీష్ రావు మాట్లాడుతూ..”దేశంలోనే తొలిసారిగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య సమాచార యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలలో మందులన్నీ ఉచితంగా అందిస్తున్నాం. ప్రైవేటు దుకాణాలకు మందుల చీటీలు రాసే వైద్యులను ఇంటికి పంపిస్తాం. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయ, మోకీలు మార్పిడుల వంటి ఖరీదైన ఆపరేషన్లను కూడా ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్చానున్నాం” అని ఆయన అన్నారు.

ఈ యాప్‌ ద్వారా..
1. దగ్గరలోని సర్కారు దవాఖానాలు, ప్రభుత్వ డయాగ్నొస్టిక్‌ కేంద్రాల చిరునామాను తెలుసుకోని, గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఆ కేంద్రానికి వెళ్లొచ్చు.
2. టెస్టుల స్టేటస్‌తోపాటు రిపోర్టులు కూడా చూసుకోని, వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
3. వైద్యులు, నర్సులు, సిబ్బంది, ఆశ వర్కర్లు తమ అభిప్రాయాలను యాప్‌ ద్వారా తెలుపవచ్చు.
4. రోగులు అసౌకర్యాలపై ఫిర్యాదు చేయొచ్చు.
5. పాత పరీక్షల రిపోర్టులను చూసుకునే సౌకర్యం, ఆ రిపోర్టులను మొబైల్‌ఫోన్‌ ద్వారా డాక్టర్లకు చూపొచ్చు.