ఇలా చేస్తే దగ్గు, జలుబు, గొంతునొప్పి ఉష్ కాకి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇలా చేస్తే దగ్గు, జలుబు, గొంతునొప్పి ఉష్ కాకి..

July 27, 2017

వర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి సర్వసాధారణంగా ఎవరికైనా వస్తాయి. వాటిని తగ్గించుకునేందుకు మనం టాబ్లెట్స్ వేసుకుంటాం ..కానీ అవీ ఇవీ టాబ్లెట్స్ ఇష్టం వచ్చినట్లు వాడితే ఎప్పటికైనా ప్రమాదం తప్పదు. అందుకే సహజ సిద్దంగా దొరికే వాటితో ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలో తెలుసుకుందాం…

1. చిటికెడు వామును చప్పరిస్తూ నమిలితే దగ్గు జలుబు,గొంతు నొప్పి తగ్గుతుంది.

2. రోజూకు 3 పూటలు కొన్ని తులసి ఆకులను నమిలి మింగుతూ ఉండాలి, ఇంకా తులసి ఆకులను మరగించి తాగితే చాలు దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గుతుంది.

3. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క, ఒక టీస్పూన్ తేనెలను కలిపి ఆ మిశ్రమాని అలాగే చప్పరించాలి. ఇలా రోజుకు 3 సార్లు చప్పరిస్తే చాలు.

4. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడ్ పసుపు వేసి కలిపి తాగితే చాలు.

5. వేడి నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం వేసి కలిపి తాగితే దగ్గు, జలుబు, మాయం.

6. తేనె ,అల్లం రసం, నిమ్మరసం ఒక టీస్పూన్ మోతాదులో కలిపి తిసుకుంటే దగ్గు జలుబు నుంచి ఉపశమనం.

7.తేనె, మిరియాలను కలిపి ఒక టీస్పూన్ తీసుకుంటే జలుబు నుంచి ఉపశమనం.

8.అల్లం ముక్కను వేడినీటిలో వేసి మరగించి ఆ నీటిని తాగినా చాలు అనారోగ్య సమస్యలు రావు.