పాలలో పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి ఏంత మేలో... - MicTv.in - Telugu News
mictv telugu

పాలలో పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి ఏంత మేలో…

July 26, 2017

రోజూ వంటల్లో పసుపును ఉపయోగిస్తాం. పసుపు వలన కూరల్లో మంచి వాసన, రుచి వస్తుంది. పసుపు ఒక యాంటీ బయోటిక్ గా పని చేస్తుంది. దీనివల్ల ఎన్ని
ఉపయోగాలు ఉన్నాయో తెలుసా.. చాలా మంది రోజూ పాలను తాగుతారు. అయితే రోజూ పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో
చిటికెడు పసుపు కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఏంత మంచిదో తెలుసా.. ఇప్పుడు అదే తెలుసుకుందాం..

1. గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

2. జ్వరం, జలుబు దగ్గు తగ్గుతాయి, ఇన్ ఫెక్సన్లు రావు, శ్వాసకోశ సమస్యలు నుంచి ఉపశమనం, ఆస్తమా ఉన్నవారికి చాలా మంచిది

3. కఫం తగ్గిపోతుంది, నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి మంచి ఔషదం, దీంతో చక్కగా నిద్రపొవచ్చు

4. మహిళలకు రుతు సమయంలో వచ్చే కడుపునొప్పి, అధిక రక్తస్రావం సమస్యల నుంచి ఉపశమనం

5. హర్మోన్ల సమస్యలు తొలగిపోతాయి, జీవక్రియలు మెరుగవుతాయి

6. తిన్న ఆహరం సంపూర్ణంగా జీర్ణమవుతుంది, గ్యాస్, అసిడిటి తగ్గుతుంది, జీర్ణాశయం , పేగుల్లో ఉండే క్రిములు నశిస్తాయి.