నిమ్మ రసంతో ఎన్ని లాభాలో... - MicTv.in - Telugu News
mictv telugu

నిమ్మ రసంతో ఎన్ని లాభాలో…

July 27, 2017

పొద్దున చాలా మంది వేడి వేడిగా కాఫీ నో లేదా టీ నో తాగుతారు. దీంతో నిద్ర మత్తు వదలి యాక్టీవ్ గా ఉంటారని, అయితే ఆరోగ్యాన్ని
పాడుచేస్తాయి. ఉదయాన్నే అవి తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అవి కాకుండా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొంచం నిమ్మ రసం
కలిపి తాగితే ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా. ఇప్పడు వాటి గురించే తెలుసుకుందాం..

1. ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగితే శరీరంలో ఉండే విష , వ్యర్థ పదార్థాలు
బయటికి పోయి శరీరం అంతర్గతంగా శుభ్రం అవుతుంది.

2. విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, బాక్టీరియా, వైరస్ ఇన్ ఫెక్షన్లు రావు. దగ్గు,జ్వరం తగ్గుతాయి.

3. జీర్ణాశయం శుభ్రమవుతుంది. గ్యాస్,అసిడిటీ ,మలబద్దకం దరిచేరావు. తిన్న ఆహరం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది.

4. చర్మం కాంతివంతంగా మారి, వెంట్రుకలు దృడంగా,ఒత్తుగా పెరుగుతాయి.

5. శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. దీంతో శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోయి, అధిక బరువు తగ్గుతారు.