అధిక బరువు తగ్గాలంటే ఇలా చేయండి... - MicTv.in - Telugu News
mictv telugu

అధిక బరువు తగ్గాలంటే ఇలా చేయండి…

July 29, 2017

కలబంద(అలోవెరా) వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? దీని వలన అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.అంతేకాక శరీరానికి
కావల్సిన పోషకాలు అందుతాయి. కలబందతో అధిక బరువు కూడా తగ్గించుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం..

1. ఒక కప్పు నీటిలో కొద్దిగా కలబంద,అల్లం రసం కలిపి ఉదయం పరిగడుపునే తాగితే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోయి.
అధిక బరువు తగ్గుతుంది.

2.గ్రీన్ టీ లో కలబంద కొద్దిగా కలిపి ఉదయం, రాత్రి తీసుకున్న అధిక బరువు తగ్గిపోతుంది.

3.రోజు కొద్దిగా కలబంద, స్ట్రాబెర్రీ పండ్ల తో కలిపి రెండు పూటలు తినాలి ,దీంతో ఒంట్లో ఉన్న కొవ్వు త్వరగా కరిగి పోతుంది.

4. కలబంద రసాన్ని రోజూ ఉదయాన్నే పరిగడుపున తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

నోట్: కొందరికి కలబంద పడక రియాక్షన్ వస్తుంది, కావున వారు తీసుకోకపోవడమే ఉత్తమం.