మెుక్కజొన్నతో ఆరోగ్యం… - MicTv.in - Telugu News
mictv telugu

మెుక్కజొన్నతో ఆరోగ్యం…

August 19, 2017

మెుక్కజొన్న కండెలు వేడి వేడిగా తింటే ఆ టేస్టే వేరు. ఇంకా వర్షం పడుతుంటే కండెలు గాని, మెుక్కజొన్నతో చేసిన గారెలు తింటే అబ్బఅబ్బ మాటల్లో చెప్పలేం.  ఆ మజాతో పాటు ఎన్ని ఆరోగ్య ప్రయోజానాలు ఉన్నాయో తెలుసా మీకు ? మెుక్కజొన్న తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆహార నిపుణులు చెప్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..

మొక్కజొన్న గింజలు పసుపు రంగులో ఉండటం వలన మినరల్స్ అధికంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో మెగ్నీషియం, ఐరన్, రాగి, పాస్ఫరస్ ఎముకల గట్టిదనానికి ఉపయోగపడతాయి.

_మెుక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.  ఈ విత్తనాలతో చేసిన నూనెను చర్మానికి రాస్తే దద్దుర్లు రాకుండా ఉంటాయి.

_మెుక్కజొన్నలో పీచు పదార్థం వల్ల జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. మలబద్దకం, మెులలు , పేగు క్యాన్సర్ రాకుండా ఉంటుంది.

_మెుక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది . దీని గర్భవతులు తినడం వలన వారి కడుపులో శిశువు మంచి బరువును కల్గి ఉంటుంది. కాళ్లు, చేతులు వాపు రాకుండా ఉంటుంది.

_రక్తహీనతను ఆరికట్టడంలో మంచి ఔషధంగా పనిచేస్తుంది.