గులాబీ తో అందం... - MicTv.in - Telugu News
mictv telugu

గులాబీ తో అందం…

July 27, 2017

గులాబీ చాలా అందంగా ఉంటుందని అలాగే చూస్తూ ఉండడం కంటే దాని రోజు వాడితే ఎన్ని
లాభాలో తెలుసా.. గులాబీని వాడడం ద్వారా బ్యూటీ పార్లర్ కి వెళ్లే ఫ్రీక్వెన్సీ ని తగ్గిపొవడం ఖాయం.
అదే గులాబీ మహిమ, మరి అదెలాగంటే ..

1. రోజ్ వాటర్, నిమ్మ రసం కలిపి స్కిన్ టానిక్ గా వాడితే మెుటిమలు, కురుపులు రావు.
2.బాదం అయిల్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ గా వేసి అరగంట తరువాత కడిగితే చర్మం కోమలంగా అవుతుంది.
ఇది డ్రై స్కిన్ కు ఉపయెగం
3. తేనె, రోజ్ వాటర్, బాదం మూడింటిని కలిపి ముఖానికి ప్యాక్ గా వేసుకుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.
4. రోజ్ వాటర్ లో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేసి వైటానింగ్ గా కూడా పనిచేస్తుంది.
5.స్నానం చేసే నీళ్ల లో రోజ్ వాటర్ వేసుకోని స్నానం చేస్తే చర్మానికో మెరుపు తో పాటు ,ఒత్తిడి తగ్గి శరీరం తాజాగా ఉంటుంది.
6.రోజ్ వాటర్ తో కళ్ల ను శుభ్రం చేసుకుంటే కళ్లు మెరిసిపొతాయి.
7. రోజ్ వాటర్ లో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల కాలుష్యం నుంచి కాపాడుతుంది.
8. షాంపూలో రోజ్ వాటర్ ను కలిపి వాడితే జుట్టు కుదుళ్లకు కండిషనింగ్ గా పనిచేస్తుంది.
9.రోజ్ వాటర్ ను కలబందను సమపాళ్ల లో కలిపి మాడకు రాసి అరగంట తరువాత కడిగేయాలి,ఆలా చేస్తే జుట్టు చిక్కులు తీయడం సులభం అవుతుంది.