ఆకు కూరల వలన ఏంత ఉపయోగం తెలుసా.. ప్రకృతి సిద్దంగా లభించే వివిధ రకాల ఆకుకూరలలో ఉండే పోషకాలు,విటమిన్లు
మాంసాహరంలో కూడా లభించవు. విటమిన్ల లోపం తో బాధపడుతున్నా చిన్నారులు,గర్బిణులు,బాలింతలు రోజూ ఆహరంలో తీసుకోవాలని
డాక్టర్లు సూచిస్తున్నారు. రూపాయి ఖర్చు లేకుండా పెరట్లోనో లేదా డాబా పైన వేపుకోని మంచి ఆరోగ్యాని పొందొచ్చు.
కరీవేపాకు..
మనం కరివేపాకును అన్ని కూరల్లో వాడుతాం. కరివేపాకు కేన్సర్ ను నివారిస్తుంది. అంతేకాక మలబద్దక సమస్యతో పాటు కాలేయాన్ని
ఉత్తేజపరచి,రక్తపోటును అదుపులో పెడుతుంది.
పుదీనా..
పుదీనా మంచి వాసన గలది దీనిని తింటే మెదడు చురుకు గా పనిచేస్తుంది.పుదీనా ఆకులు నీటిలో కలిపి స్నానం చేస్తే రక్త ప్రసరణ
బాగుంటుంది.ఉదయం పూట దీనిని తింటే గ్యాస్ట్రిక్ తగ్గుతుంది.పుదీనా రసంతో తలనోప్పి,గొంతునోప్పి తగ్గుతుంది.
పాలకూర..
పాలకూర లో బీ కాంప్లెక్స్ విటమిన్ల వల్ల చర్మవ్యాధులు రావు. రక్తపోటు తగ్గి,కంటి చూపు మెరుగుపడుతుంది.
గొంగూర..
గొంగూరలో ఐరన్ ఉంటుంది. కొలెస్ట్రాల్,రేచీకటి,అధిక రక్తపొటు, నిద్రలేమి బట్టతల సమస్యలకు గొంగూర తింటే చాలు.
కొత్తమీర..
అన్ని కూరల రుచిని పెంచుతుంది.మాంసాహరం ,చేపలు లలో కొత్తిమీర ఉంటే ఆ టేస్టే వేరు.దీని వలన శరీర ఉష్ణ్రోగ్రతను తగ్గిస్తుంది.
విరోచనాలను నియత్రిస్తుంది.
ముల్లంగి..
ముల్లంగి ఆకులను తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.అలాగే విరోచనాలకు విరుడుగా,శరీర గాయాలకు మందుగా పనిచేస్తుంది.
మెంతికూర..
మెంతికూర తింటే రక్తపోటును కంట్రోల్ లో పెట్టుతుంది.అలాగే మధుమేహంను కూడా నియంత్రిస్తుంది.