జుట్టు రాలుతోందా...ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి - MicTv.in - Telugu News
mictv telugu

జుట్టు రాలుతోందా…ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి

July 18, 2017

చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందర్ని వేధించే సమస్య జుట్టు రాలడం . అందువల్ల అందంగా కనిపించం అని ఆవేదన పడుతుంటారు.జుట్టు రాలిపోకుండా కాపాడుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

జుట్టు ఎందుకు రాలితుంది..

1. పోషకాహర లోపం హార్మోన్లు అసమౌతుల్యత,థైరాడ్,పిసివోఒడి ముఖ్యమైన సమస్యలు.

2. కడుపుతో ఉన్నప్పుడు పిల్లలు పుట్టకుండా వాడే పిల్స్.

3. రసాయనాలు ఉన్న హెయిర్ ఫ్రాడెక్ట్ లు వాడడం వల్లన వేంట్రుకలు చాలా రాలిపోతున్నాయి.

4. సన్నగా కనిపించాలని క్రాష్ డైట్లు చేయడం,లావు పెరగడం.జడను గట్టిగా వేసుకోవడం.

5. వయస్సు పెరగడం.సి విటమిన్ లోపం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి.

జుట్టు పెరగాలంటే ఏం చేయాలి..

1. కొబ్బరి లేదా బాదం నూనెను వేడిచేసి మాడకు రాసి వేళ్లతో మెల్లగా మర్థనా చేయాలి.

2. బీట్ రూట్ జ్యూస్,గ్రీన్ టీ,ఉసిరి,వేపాకుల హెయిర్ మాస్కులతో జుట్టు పెరుగుతుంది.

3. ఒక టేబుల్ స్పూన్ ఉసిరి గుజ్జు,నిమ్మరసంలను కలిపి దాంతో తలకు మర్థనా చేసి రాత్రింతా అలాగే ఉంచుకోని మార్నాడు షాంపుతో
తలస్నానం చేయాలి.

4. రాత్రి ఒక కప్పు మెంతులను నానబెట్టి ఉదయం గ్రైండ్ చేసి పేస్టులా చేసి ఆపేస్టు ను తలకు రాసుకోని 40 నిమిషాల తరువాత తలస్నానం
చేయాలి,నెల రోజులు ఇలా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

5. ఉల్లిపాయను గ్రైండ్ చేసిఆ గుజ్జు నుంచి రసం తీసి దాని తలకు రాసుకోని అరగంట తరువాత నీటితో కడిగి షాంపుతో కడుకోవాలి.

6. ముడు టేబుల్ స్పూన్లు ఉల్లిరసం,రెండు టేబుల్ స్పూన్లు కలబంద,ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మూడింటిని కలిపి వేంట్రుకలకు
రాసి. అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేస్తే జుట్టు రాలదు.

7. కలబంద జెల్ తలకు పట్టించి ఒక గంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి .ఇలా వారానికి 4 సార్లు చేస్తే జుట్టు బాగా
పెరుగుతుంది.