Healthly Fruits Must Eat During Winter Season
mictv telugu

శీతాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన పళ్ళు

January 3, 2023

fruits you must eat during winter

శీతాకాలం….అన్నిటికంటే సున్నితమైన కాలం.ఈ టైమ్ లో వైరస్ లు, వైరల్ లు ఎక్కువగా ఉంటాయి. ఇమ్యునిటీ తగ్గిపోతుంది. కాబట్టి తొందరగా జబ్బులు ఎటాక్ అయిపోతాయి. దీనికి తోడు చలి. దీని వల్ల పెద్దలకు ముఖ్యంగా పిల్లలకు అస్తమానమూ జలుబు, దగ్గు, జ్వరాలు వస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే ఏవేవో చేయాలని చాలా మంది చెబుతుంటారు. వేడివేడి పదార్ధాలు తినాలని కూడా. కానీ అన్నింటికన్నా మనకు బాగా హెల్స్ చేసేవి పళ్ళు. సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడూ చాలా ఆరోగ్యం, అవే కాకుండా శీతకాలంలో తినాల్సినవి ఏమున్నాయో తెలుసుకుందాం.

సాధారణంగా చలికాలంలో విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లను తీసుకోవడం మంచిది. ఎందుకంటే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పియర్ :

పియర్ చలికాలంలో తినాల్సిన పండు. చలికాలంలో సులభంగా లభించే పండ్లలో ఇది ఒకటి. దీని రసం ఆరోగ్యానికి మంచిది. పిల్లలు కూడా దీన్ని ఇష్టపడతారు. అదనంగా, ఇది ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఇంకా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వీటిల్లో విటమిన్ సి, ఇ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి.

దానిమ్మ :

చలికాలంలో కూడా సులభంగా లభించే పండు దానిమ్మ. ఈ దానిమ్మ పండును తింటే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. సాధారణంగా చలికాలంలో రక్త సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో దానిమ్మ తినడం మంచిది. ఇది కాకుండా, దానిమ్మ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఇది శరీరంలోని రక్తహీనతను కూడా నయం చేస్తుంది.

ఆపిల్:

రోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే ఆపిల్ అన్ని సీజన్లలో లభించే పండు. ఆపిల్స్‌లో విటమిన్ ఎ, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. రోజూ ఆపిల్ తినడం వల్ల మెదడు,శరీరం మంచిగా తయారవుతాయి. చలికాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఆపిల్ లేదా యాపిల్ జ్యూస్ తాగాలి.

జామ:

చలికాలంలో జామపండు తినకూడదని చాలా మంది చెబుతుంటారు. అయితే ఇది సీజనల్ ఫ్రూట్. చలికాలంలో దీన్ని తినడం వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సీజనల్ పండ్లు శారీరక ఆరోగ్యానికి ఎప్పుడూ మేలు చేస్తాయి. చలికాలంలో జామ పండు తింటే పొట్ట శుభ్రపడుతుంది. అదే సమయంలో జలుబు సమస్య దూరమవుతుంది. అంతే కాదు జామపండుతో విటమిన్ సి, ఇతర పోషకాలు లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి.

రేగు:

చలికాలంలోనే రేగు పళ్ళు వస్తాయి. రేగు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. అదనంగా రేగులో యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. చలికాలంలో రేగు పండ్లను తింటే శరీరానికి బలం చేకూరుతుంది. ఇది శీతాకాలంలో సులభంగా లభించే పండు కూడా.

నారింజ:

రంగు ఆరెంజ్ సీజనల్ ఫ్రూట్. చలికాలంలో ఆరెంజ్ తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. చలికాలంలో నారింజ పండ్లను తింటే జలుబు వస్తుందని చాలా మంది అనుకుంటారు. అయితే అది నిజం కాదు. చలికాలంలో ఆరెంజ్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, నారింజ చాలా పుల్లని రుచిని కలిగి ఉంటుంది, కాబట్టి సాయంత్రం లేదా రాత్రి తినకూడదు.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి… ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఆరెంజ్ పండును పిల్లలకు రోజూ ఇవ్వవచ్చు. ఇది పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నారింజలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ, కాపర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పోషకాలు చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేస్తాయి.

అరటిపండు:

అన్ని సీజన్లలో లభించే ఏకైక పండు అరటి. కానీ చాలా మంది చలికాలంలో అరటిపండ్లు తినకుండా ఉంటారు. ఎందుకంటే ఇది జలుబు, దగ్గు సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అయితే నిజానికి చలికాలంలో అరటిపండ్లు తినడం చాలా మంచిది. రోజూ అరటిపండు తింటే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది.దీన్ని పిల్లలకు కూడా ఇవ్వవచ్చు. ఇది ఎటువంటి జలుబు మరియు ఫ్లూని కలిగించదు. అయితే ఇప్పటికే జలుబు ఉంటే, అరటిపండ్లు తినవద్దు. ఎందుకంటే ఇది శ్లేష్మాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.

అన్ని కాలాలలోనూ చిన్నారులకు.. అరటిపండు పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో బోలెడు పోషకాలున్నాయి. పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఎ, బి, సి, విటమిన్ బి6 , ఐరన్‌, ఫైబర్‌, కార్బోహైడ్రేట్ లాంటివి ఎన్నో ఉన్నాయిందులో. ఇవి పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి సహాయపడతాయి. పిల్లల డైట్‌లో అరటిపండు చేర్చడం వల్ల వారి జ్ఞాపకశక్తి బలపడుతుంది,వారిని యాక్టివ్‌గా ఉంచుతుంది. ఈ పండులో ఉండే.. విటమిన్ B6, మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేసి నిద్రకు ఉపకరిస్తాయి.అరటిపళ్ళు ఇమ్మీడియెట్ శక్తిని ఇస్తాయి. అరటిపండులో ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పిల్లల్లో మలబద్ధకం ఉంటే.. నివారిస్తుంది. లండన్ లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన పరిశోధకులు రోజుకు 1 అరటిపండు తినే పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశం 34 శాతం తక్కువగా ఉందని కనుగొన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని చిన్న పిల్లలకు అరటిపండు కచ్చితంగా పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి : 

56 వేలకు చేరువలో బంగారం.. వెండి బిగ్ షాక్..

బీజేపీని దెబ్బ కొట్టింది నినే.. కేసీఆర్ కాదు ED,CBI ఎవనికి భయపడేది లేదు.. ఎమ్మెల్యే కొనుగోలు పై పైలట్ రోహిత్ రెడ్డి