మొటిమలున్నాయా..క్రీములు మానేసి ఇవి తినండి.. - MicTv.in - Telugu News
mictv telugu

మొటిమలున్నాయా..క్రీములు మానేసి ఇవి తినండి..

July 21, 2017

టీనేజర్లు ఎక్కువగా మొటిమల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఏవేవో క్రీములు రాస్తూ ఉంటారు. అయినా కూడా తగ్గవు. అలాంటి వారు
క్రీములు రాయడం మానేసి ఇవి తీంటే చాలు మొటిమలు మాయమౌతాయి.

1. పాలకూరలో విటమిన్ ‘ ఎ ’ ఉండటమే కాక క్లోరోఫిల్ వల్ల శరీరంలో ఉన్న బ్యాక్టీరియా ట్యాక్సిన్ల రూపంలో బయటికి పోతుంది.
మొటిమలు తగ్గడంలో తోడ్పడుతుంది.

2. పసుపు బ్యాక్టీరియాను, ట్యాక్సిన్లను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. రోజూ ఆహరంలో తీసుకుంటే మంచిది.

3. క్యారెట్ లో బీటా కెరోటిన్ విటమిన్ ‘ఎ ’గా లిభిస్తుంది. స్నాక్స్ గా తీసుకుంటే మొటిమలు తగ్గుతాయి.

4. చేపలలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అవి తినడం వలన ఆరోగ్యంతో పాటు చర్మం కూడా కాంతివంతంగా
తయారౌతుంది.