వర్షాకాలంలో ఇవి తినకూడదటా.. - MicTv.in - Telugu News
mictv telugu

వర్షాకాలంలో ఇవి తినకూడదటా..

July 18, 2017

వర్షం పడుతుంటే చల్లని వాతావరణంలో ఏమైనా వేడి వేడిగా తినాలని ఉంటుంది కదా.!వానాకాలంలో ఎవరైనా అలాంటివే తినడానికి
ఇష్టపడుతారు.కానీ ఈ కాలంలో తినకూడని ఆహరపదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి.అవి ఎందుకు తినకూడదో,తింటే ఏం జరుగుతుందో
తెలుసుకుందాం..

1. ఫ్రై చేసిన పదార్థాలు.

వానాకాలంలో మన జీర్ణ వ్యవస్థ పని తీరు సరిగ్గా ఉండదు.అందువల్ల నూనెలో బాగా వేయించిన ఆహరంతింటే అజీర్తి సమస్య వస్తుంది.
దాంతో గ్యాస్,అసిడిటీకి దారి తీస్తుంది.కనుక వానాకాలంలో ఫ్రై చేసిన ఆహరం తినకపోవడమే మంచింది.

2. సీ పుడ్..

వానాకాలంలో చేపలు,రోయ్యలు బాగా దొరుకుతాయి.వాటి పైన లార్వా,వైరస్ క్రిములు ఎక్కువగా ఉంటాయి.మార్కెట్ లో అమ్మే చేపలు,
రోయ్యల పై ఈ కాలంలో ఉండే తేమ వల్ల బాక్టీరియాలు ఎక్కువగా ఉంటాయి,విటిని ఎంత క్లీన్ చేసిన సరిగ్గా పోవు కనుక వాటిని తినకపోవడమే
మంచింది.

3.జ్యూస్ లు.

బయట అమ్మే పండ్ల రసాలను తాగకూడదు.ఎందుకంటే వానాకాలంలో తేమ వల్ల బ్యాక్టీరియా ప్రభావానికి లోనవుతాయి.నీరు కూడా
కలుషితం అవుతుంది.కనుక ఇంట్లోనే జ్యూస్ ని తయారు చేసుకోని తాగాలి.

4. కూల్ డ్రింగ్స్..

బాటిల్స్,సీసాల్లో అమ్మే కూల్ డ్రింగ్స్ ,ప్రూట్ జ్యూస్ లను తాగరాదు.వానాకాలంలో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.జీర్ణాశయంలో ఎంజైమ్ ల
పనితీరుకు ఆటంకం ఏర్పడుతుంది. కూల్ డ్రింగ్స్ తాగకపోవడమే ఉత్తమం.

5. ఆకు కూరలు..

వార్షాకాలంలో ఆకు కూరల పైన క్రిములు,బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయి.వాటి పైన చిన్న చిన్నగా కొన్ని మనకు కనిపించని బ్యాక్టీరియా
వలన ఆరోగ్యం పాడు అవుతుంది.