వానాకాలం వ్యాధుల సీజన్. జరభద్రం... - MicTv.in - Telugu News
mictv telugu

వానాకాలం వ్యాధుల సీజన్. జరభద్రం…

July 14, 2017

వర్షాకాలం వచ్చిందంటే చాలు . ఇన్ ఫెక్షన్లు కూడా చాలా త్వరగా వస్తాయి.కొన్ని వైరల్,బ్యాక్టీరియా,ఫ్రోటోజువల్ వలన ఎక్కువగా వర్షకాలంలో వ్యాపిస్తున్నాయి. ప్లూ వైరస్,స్వైన్ ప్లూ,ఇన్ ప్లూయెంజా లు ఈ వైరస్ లు శ్వాసనాళంలో ఉండే అవయవాల మీద ప్రభావం చూపిస్తాయి.శ్వాసనాళం,గొంతు,ఊపిరితిత్తుల వంటి అవయవాలలో ఇన్ ఫిక్షన్లు వస్తాయి .త్వరగా గుర్తించి ట్రిట్ మెంట్ తీసుకోవడం వల్ల మళ్లీ రాకుండా నివారించవచ్చు.ప్లూ వైరల్ దీని ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.దగ్గినప్పుడు రక్తం పడటం,బీపీ తగ్గడం.చాలా నీరసం వీటి లక్షణాలు. సరైన టైంలోచికిత్స తీసుకుంటే మంచింది. వైరల్ హెపటైటిస్ అక్యూట్ వైరల్ ,ప్లూ లక్షణాలతో పాటు యూరిన్ ముదురు,లేత రంగులు ఉండడం.జ్వరం దీని లక్షణాలు.అక్యూట్ వైరల్ హెపటైటిస్ ఉంటే చికిత్స ఆలస్యం అవుతుంది డెంగ్యూ జ్వరం నివారణకు మందులు లేవు.జ్వరం తగ్గించడానికి మాత్రమే మందులు ఉన్నాయి.వైరల్ ఇన్ ఫెక్షన్లు ఒకరి నుంచి మరోకరికి వ్యాపించకుండా జాగ్రత్తలు పాటించాలి.

నివారణ చర్యలు..

1,వానాకాలంలో చేతులు శుభ్రంగా కడుకోవాలి.

2, పిల్లలకు వ్యాక్సిన్లు వేయించాలి

3,పిల్లలకు,వృద్దలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.వారికి ఇంజక్షన్లు తప్పనిసరి ఇవ్వాలి.

4,దోమలను ఆరికట్టాలి.డెంగ్యూకి వ్యాక్సిన్లు అందుబాటు లో లేవు.

5,హెపటైటిస్ కు ఎ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది,నీరు కాలుషితం కాకుండా చూసుకోవాలి.