ఎక్కువ సేపు ఆలోచిస్తే మెదడు మెుద్దుబారి పోతుందనీ, అలాంటి సమయంలో కొత్త ఆలోచనలుకనిపెట్టాలంటే కొద్దిసేపు నడవాలని చెబుతున్నారు శాస్ర్తవేత్తలు . అదే పనిగా ఆలోచిస్తుంటేఉండడం వలన మెదడు పని చేయడం మానేస్తుందట, అలాంటాప్పుడే బయటికి వెళ్లినడవడం, పరుగెత్తడం వంటివి చేయడం వలన మెదడు పునరుత్సాహంతో పని చేస్తుందని,బయటికి వెళ్లి నడిచే టైం లేనప్పుడు టీవి చూడడం, తోట పని చేయడం లేదా కొత్త కొత్తవంటలు చేయడం వంటివి చేయడం వలన మెదడు చురుకుగా పని చేస్తుందన్నది ఇజ్రాయిల్పరిశోధకుల వాదన.
ఇదే విషయంలో వీరు పరిశోధనలు కూడా నిర్వహించారు.కొంతమందికి కఠినమైన పజిల్స్ ఇచ్చి ఒకరోజులో పూర్తి చేయాలని చెప్పారు. పజిల్స్ పూర్తి చేసే సమయంలో ఎక్కువ మంది చాలా టైం ఆలోచించారు, ఎంతసేపు ఆలోచించిన పజిల్స్ ని పూర్తి చేయలేకపోయారు. మిగతా వారు తమ ఆలోచనలు పక్కన పెట్టి మనస్సు ను మరో పని వైపు కేంద్రీకరించారు.మెదటి గ్రూపు కన్నా రెండవ గ్రూపు పజిల్స్ ను
తక్కువ టైంలో పూర్తి చేసింది.