సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు, న్యూస్‌లు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని అంశాలు ఇంట్రెస్టింగ్, ఫన్నీగా ఉంటే..మరికొన్ని దృశ్యాలు మాత్రం మనసుతో ముడిపోతుంటాయి. ఆలాంటి వీడియోలను చూసి తెగ ఎమోషనల్ అవుతుంటాం. ప్రధానంగా వీధి బాలలకు సంబంధించిన విషయాలు కొన్ని సార్లు కంటతడి పెట్టిస్తాయి. దుకాణదారులు నిరాశ్రయులు, బిచ్చగాళ్లను దుకాణాల ముందు నిలబడటానికి కూడా అనుమతించరు. ఎవరైనా ఇలా నిలబడితే వారిని అక్కడి నుంచి గెంటేస్తారు. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా దారుణంగా వ్యవహరిస్తారు. గతంలో ఇద్దరు చిన్నారులు కేఎఫ్‌సీ దుకాణాంలోకి పోగా వారిని సేల్స్‌మేన్ అక్కడి నుంచి బయటకు పంపివేయడంతో వైరల్ అయ్యింది. తాజాగా వైరల్ అయిన మరో వీడియో హృదయానికి హత్తుకుంటోంది.
సమాజంలో మనసుల ఆర్థిక పరిస్థితుల ప్రకారం జీవన విధానం ఉంటుంది. ఎవరి స్థోమతలో వారు జీవిస్తూ ఉంటారు. ధనికుల లైఫ్ స్టైల్ ఎప్పుడూ పేదవారికి వింతగానే అనిపిస్తోంది. ప్రధానంగా చిన్నారులు కొన్ని విషయాలకు బాగా కనెక్ట్ అవుతారు. తమ ఇంట్లో లేని వస్తువులను, ఎన్నడూ చూడనివి కంటపడితే ఆనందంతో ఉబ్బతబ్బిపోతారు. ఆశ్చర్యంగా తిలకిస్తారు. ఇలాంటి సమయంలో కొందరు వారిని చూసి చీదరించుకుంటే..మరికొందరు వారి కళ్లల్లో ఆనందం నింపేదుకు ప్రయత్నిస్తారు. ఈ క్రింద వీడియోలో కూడే అదే జరిగింది. ఒకసారి చూడండి..
Store incharge let's homeless street kids choose what to watch on the display TV every evening. pic.twitter.com/ElOPGL61Fb
— Gautam Trivedi (@KaptanHindustan) January 5, 2023
పైనున్న వీడియోలో ఇద్దరు వీధి బాలలు ఓ ఎలక్ట్రానిక్ షోరూంలో ఉన్న టీవీలను చూసి మురిసిపోయారు. షాప్‌లోకి యజమానులు అనుమతించకపోవడంతో బయట నుంచే టీవీ చూస్తూ సరదా పడ్డారు. ఇంతలో ఓ సేల్స్ మాన్ బయటకు వచ్చి చిన్నారులు ఎక్కువగా ఇష్టపడే కార్టూన్ ఛానెల్ పెట్టడంతో వారు ఎంజాయ్ చేశారు. చాలాసేపు టీవీ చూస్తూ అలానే ఉండిపోయారు. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ఎమెషనల్‌గా కామెంట్స్ చేస్తున్నారు.