సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత అరచేతిలోనే, అంతర్జాలం సహాయంతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక విషయాలను, వింతలను , విడ్డూరాలను తెలుసుకునే వెసులుబాటు లభించింది. వందల్లో , వేలల్లో వీడియోలు నెట్టింట్లో కనిపించినా కొన్ని మత్రమే మనసుకు హత్తుకుంటాయి. వాటిని చూసి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాము. అలాంటి వీడియోనే నెట్టింట్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందకు ఓ యువకుడు తన పెద్దలను ఒప్పించిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియో పోస్ట్ అయిన కొద్ది గంటల్లోనే నెట్టింట్లో లక్షల్లో వ్యూస్ లభించాయి. నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపించారు.
తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పేందుకు మనవాళ్ళు పడే కంగారు ఓ రేంజ్ లో ఉంటుంది. ధైర్యంగా ప్రేమించిన అమ్మాయిని, అబ్బాయిని ఇంట్లో వారికి పరిచయం చేసేవారు చాలా తక్కువమందే ఉంటారు. అంతే కాదు పెద్దలు అంత ఈజీగా ప్రేమ వివాహాలకు ఓకే చెప్పరు. ఆ పేరు ఎత్తితేనే రగిలిపోతుంటారు. కానీ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే యుద్ధాలే చేయాల్సిన అవసరం లేదు. తనని ఎంతలా ప్రేమిస్తున్నాడో ఆ అమ్మయి పెద్దలకు తెలిసేలా చెప్పి ఒప్పిస్తే సరిపోతుందని నిరూపిస్తున్నాడు ఓ విదేశీ కుర్రాడు. . ఆ ప్రయత్నం విజయం సాధించి తోటి ప్రేమికులకు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాడు. ఈ వీడియో ఏ దేశం నుంచి వచ్చిందో తెలియదు కానీ కుర్రాడు మాత్రం అందరికీ బాగా కనెక్ట్ అయ్యాడు. తమ పెళ్లికి ఒప్పుకోవాలని గర్ల్ ఫ్రెండ్ తండ్రిని రిక్వెస్ట్ చేసిన తీరు అందరిని అమితంగా ఆకట్టుకుంది. మామ కార్లలో కూర్చుకున్న కుర్రాడు…”మామా మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, తనను జీవితాంతం బాగా చూసుకుంటాను, తనతో పాటు మీమ్మల్ని ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తాను కూడా , వివాహం కోసం వెడ్డింగ్ రింగ్ తీసుకున్నాను , మీరు పెళ్లికి ఓకే చెప్పి ఆశిస్సులు అందించండి అని కుర్రాడు చెప్పడంతో అమ్మాయి తండ్రి భావోద్వేగానికి లోనై ఏడ్చేశాడు. ఈ సెంటిమెంట్ వీడియో నెట్టింట్లో ఎంతో మందిని కదిలించింది.