కరాటే చిన్నోడి కంట కన్నీరు.. కోటిన్నర వ్యూస్ - MicTv.in - Telugu News
mictv telugu

కరాటే చిన్నోడి కంట కన్నీరు.. కోటిన్నర వ్యూస్

May 16, 2019

సీనియర్ కరాటే యోధులు రాళ్లు పగలగొట్టగా చూశాం. కానీ ఓ బుల్లి కరాటే వీరుడు టైల్స్‌ను కాలితో రెండు ముక్కలు చేశాడు. అతని వయసు నాలుగేళ్లే. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోకు కోటిన్నర వ్యూస్, మూడు లక్షలకు పైగా లైక్స్, రెండు లక్షలకు పైగా యూజర్లు ఆ వీడియోను షేర్ చేశారు. బుడ్డోడు గట్టి పట్టుదల కలవాడని కామెంట్లు చేస్తున్నారు.

అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన జరిగింది. కొందరు పిల్లలు కరాటే నేర్చుకుంటారక్కడ. ట్రయినర్ ఎరిక్ గియానీ సూచనల మేరకు ఈ చిన్నారి టైల్స్‌ను తన కాలితో పగలగొట్టాలి. తొలుత ఆ రాయిని పగలగొట్టడానికి ఆ బుడ్డోడు ఆపసోపాలు పడ్డాడు. టైల్స్‌ను బలంగా తన్నినప్పుడు అతని కాలికి దెబ్బ తగలింది. దెబ్బకు బాధతో మూలిగాడు. నాతో అవట్లేదని ఏడ్చాడు. కానీ ట్రయినర్ ఆ పిల్లాణ్ణి మరింత ప్రోత్సహించాడు. ఇంకొక్కసారి ప్రయత్నించు అంటూ ఉత్సాహాన్ని నింపాడు. అంతే గట్టిగా శ్వాస ఉగబట్టి ఒక్క తన్ను తన్నాడు. దెబ్బకు రాయి రెండు ముక్కలైంది. ట్రయినర్ అతణ్ని పట్టుకుని ఆనందంతో కేరింతలు కొట్టాడు. తోటి పిల్లలందరూ ఆ చిన్నోడిని మెచ్చకున్నారు. వెంటనే ట్రయినర్ అతనికి ఓ బహుమతి కూడా ఇచ్చి మైమరిపింపజేశాడు.

కష్టాలు ముంచెత్తినా పట్టుదల వీడకుండా.. ఓడిపోతున్నా ప్రయత్నిస్తే తప్పక గెలుస్తామని చెప్పిన ఆ చిన్నారిలోని ధృఢసంకల్పానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్రింది లింకులో మీరూ ఆ వీడియోను చూడవచ్చు.