మిత్ర పక్షాలైన బీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య రచ్చ జరిగింది. అసెంబ్లీ సాక్షిగా ఇరు పార్టీల నేతలు విమర్శలు సంధించుకున్నారు. మంత్రి కేటీఆర్, మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య వాగ్యుద్ధం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అక్బరుద్దీన్ నిలదీశారు. ఆవేశంగా మాట్లాడ్డం సరికాదని, ఎడుగురు సభ్యులు ఉన్న పార్టీ ఎక్కువ టైం తీసుకోవద్దని కేటీఆర్ కౌంటర్ వదిలారు.
మొదట.. సభలో సభాపతి, మంత్రులు, ఎమ్మెల్యేలు లేకపోవడంతో అక్బరుద్దీన్ మండిపడ్డారు. ‘ఇలాంటి సభను పాతికేళ్లలో ఎన్నడూ చూడలేదు. బీఆర్ఎస్ నేతలకు టీవీ చర్చకు వెళ్లేందుకు టైం ఉంటుంది కానీ సభకు వచ్చేందుకు టైం ఉండదా?’’ అని ప్రశ్నించారు. పాతబస్తీలో మెట్రోరైల్ సంగతి ఏమందని, ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి ఏమిటని నిలదీశారు. బీఏసీలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
దీనిపై కేటీఆర్ స్పందిస్తూ, ఆరోపణలు నిజం కాదని, ఏడుగురు ఎమ్మెల్యేలున్న పార్టీ ఎక్కువ టైమ్ అడగడం సరికాదని అన్నారు. ‘ఆవేశంగా మాట్లాడటం కాదు, అర్థవంతంగా సమాధానం ఇవ్వాలి. సభా నాయకుడితో మీకేం సంబంధం’’ అని ప్రశ్నించారు. దీనికి అక్బరుద్దీన్ తిరిగి స్పందిస్తూ.. ‘నేను కొత్త ఎమ్మెల్యేను కాను. మా టైం ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు’’ అన్నారు.
ఇవి కూడా చదవండి :
జూ.ఎన్టీఆర్తో లాభం లేదు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
కోటం రెడ్డికి కడప నుంచి బెదిరింపులు.. జగన్నను తిడితే బండికి కట్టి ఈడ్చుకుపోతా అంటూ…