భారతదేశంలో ఎన్నో ప్రదేశాలు వింతలు, అద్భుతాలు, అందాలకు ప్రసిద్ధి. దేశంలో ఊటీ, ఎర్నాకుళం, అల్లెపి వంటి కొన్ని ప్రదేశాలకు వెళితే అక్కడినుంచి తిరిగి రావడానికి ఎవరూ ఇష్టపడరు. అలాంటి ప్రదేశాల్లో గోవాలోని దూద్‌సాగర్ వాటర్ ఫాల్స్ ఒకటి. కొద్ది రోజులుగా దేశంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా నదులు,చెరువులు నిండుకుండలా మారతున్నాయి. వాగులు,వంకలు పొంగి పొర్తుతున్నాయి. అయితే భారీ వర్షాల నేపథ్యంలో దూద్‌సాగర్ వాటర్ ఫాల్స్ పర్యాటకులను మరింత కనువిందు చేస్తోంది.
భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం.. సహజమైన అందాల మధ్య ఉన్న దూద్‌సాగర్.. మాండోవి నది నుంచి ఏర్పడింది. ఈ జలపాతం యొక్క తాజా వీడియోను బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియోలో షేర్ చేశారు. గోవా అండ్ బెల్గాం మధ్య రైలు మార్గంలో ఉన్న ఇది దేశంలోని అత్యంత అందమైన సుందరమైన ప్రదేశాలలో ఒకటని తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో 1017 అడుగుల ఎత్తు నుంచి కిందపడిన తర్వాత నీరు నాలుగు పాయలుగా విడిపోతుంది. ఈ వైరల్ వీడియో(Viral Video) నెటిజన్ల మనసులను దోచుకుంది. స్వర్గం- భూమి కలయిక అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
https://www.kooapp.com/koo/kishanreddybjp/4f99e387-d08f-4052-a97e-a5aea74654fa