క్రికెట్ చరిత్రలో రికార్డు.. అత్యంత బరువైన ఆటగాడిగా.. - MicTv.in - Telugu News
mictv telugu

క్రికెట్ చరిత్రలో రికార్డు.. అత్యంత బరువైన ఆటగాడిగా..

August 31, 2019

Rakeem.

కింగ్స్‌టన్  సబీనా పార్క్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టించింది. వెస్టిండీస్ భారీకాయుడు రకీమ్ కార్న్‌వాల్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 140 కిలోల బరువు ఉన్న కార్న్‌వాల్ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. తాజాగా ఇతడు కమిన్స్ స్థానంలో టెస్టుల్లో చోటు దక్కించుకున్నాడు. అరంగేట్రం చేయడంతోనే పుజారాను ఔట్ చేసి టెస్ట్ మ్యాచుల్లో తన తొలి వికెట్ నమోదు చేేసుకున్నాడు. 

గతంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ వార్విక్ బరువు 133 -139 కిలోల మధ్య ఉండగా..ఆ రికార్డును చెరిపేశాడు. 6.6 అడుగులతో ఆఫ్‌స్పిన్‌ బౌలర్‌గా,బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలి కాలంలో విండీస్‌ రంజీ క్రికెట్లో నిలకడగా రాణించి తాజాగా అంతర్జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అతని వయస్సు 26 సంవత్సరాలు. భారీకాయుడు అయిన కార్న్‌వాల్ ఆటతీరు చూసి మ్యాచ్ చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. తన బరువును ఏ మాత్రం లెక్కచేయకుండా అతడు కనబరిచిన ప్రతిభకు అంతా ముగ్ధులయ్యారు.