నేటి నుంచే భారీగా ట్రాఫిక్ చలానాల మోత..!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్టం 2019 నేటి నుంచి అమల్లోకి రానుంది. దీంతో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చలానాల మోత మోగనుంది. నేటినుంచి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిపై భారీ ఎత్తున జరిమానాలను విధించనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌కు లోబడి వాహనాలను నడపాలని పోలీసులు సూచిస్తున్నారు. కొత్త మోటార్ చట్టం ప్రకారం విధించనున్న భారీ జరిమాలు ఈ విధంగా ఉన్నాయి.
* అంబులెన్సు తదితర ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10వేలు,
* డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలను అతిక్రమించే ట్యాక్సీవాలాలకు రూ.1 లక్ష వరకు ఫైన్,
* ఓవర్ స్పీడ్‌కు వాహనాలను బట్టి రూ.1వేయి నుంచి రూ.2వేల మధ్యలో ఫైన్,
* సీట్ బెల్టు లేకుండా కారు నడిపినా, హెల్మెట్ లేకుండా బైక్ నడిపినా రూ.1వేయి ఫైన్,
* ఇప్పటి వరకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5వేల ఫైన్,
* సరైన అర్హత లేకుండా మైనర్లు వాహనం నడిపితే రూ.10వేల ఫైన్,
* తాగి వాహనం నడిపితే రూ.10వేల ఫైన్,
* ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2వేలు ఫైన్,
* వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే రూ.20వేల ఫైన్.
* ఇతరులకు వాహనాలు ఇవ్వడం వల్ల వారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాల ఓనర్లకు రూ.25వేల ఫైన్, 3 ఏళ్ల జైలు శిక్ష, వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు.