వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం

October 27, 2019

Heavy fire in Vanasthalipuram

హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వనస్థలిపురం  పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సుష్మా సమీపంలోని టైర్‌ రీట్రేడింగ్‌ గోదాములో మంటల ఎగసి పడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది. దీంతో స్థానికులు, అటుగా వెళ్లేవారు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.