ఎగువన కురుస్తున్న వానలతో చత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. 7 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద రాగా అధికారులు 25 గేట్లను ఎత్తి రెండు లక్షల క్యూసెక్కుల నీరును గోదావరిలోకి వదులుతున్నారు.
పై నుంచి చింతవాగు, రోటెంత వాగులు పోటెత్తడంతో గంట గంటకు వరద పెరుగుతోంది. ప్రాజెక్టు అధికారులు అక్కడే ఉంది పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇటీవలే దిగువ ప్రాంతాలు ముంపుకు గురి కాగా, జీదండుపేట, కేశవాపురం ,గొంపెనగూడెం గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటు వర్షాల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉన్న అధికారుల సెలవులు రద్దు చేశారు. భద్రాచలం వద్ద గోదావరి 46 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో అక్కడే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.