కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో మోయలేనంత బంగారం పట్టివేత - MicTv.in - Telugu News
mictv telugu

కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో మోయలేనంత బంగారం పట్టివేత

March 3, 2022

09

ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో మంగళవారం అర్ధరాత్రి 32 కిలోల బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ పోలీసులు నిర్వహించిన తనిఖీలో నలుగురు ప్రయాణీకులు చెరో ఎనిమిది కిలోల చొప్పున బ్యాగుల్లో తరలిస్తూ పట్టుబడగా, పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆభరణాలకు సంబంధించి వారి వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో రైల్వే పోలీసులు నలుగురు వ్యక్తులను, ఆభరణాలను ఒడిషా జీఎస్టీ అధికారులకు అప్పగించారు. పట్టుబడిన వ్యక్తులు ముంబైకి చెందిన హస్ముఖ్ లాల్ జైన్, సురేశ్ సహదేవ్ ఖారే, మహేశ్ భోమ్సార్, దీపక్ పటేల్ లుగా గుర్తించారు. కాగా, బంగారు ఆభరణాలు సుమారు 16 కోట్లు విలువ చేస్తుందని అధికారులు తెలిపారు.