పాకిస్థాన్‌లో ఆర్థిక మాధ్యంతోపాటు రాజకీయ అంతర్గత పోరు మరింత ముదిరింది. అధికార షాహబాజ్ ప్రభుత్వం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టబోతున్నట్లు కనిపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు ఖాయంగా కనిపిస్తోంది. ఇన్నాళ్లు ఇంట్లో బంధీగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగాంగా మాజీ ప్రధాని నివాసమైన లాహోర్ లో భారీగా పోలీసుల బలగాలు మోహరించాయి. ఇమ్రాన్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నార. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇమ్రాన్ ఖాన్ బెయిల్ పిటిషన్ను పాకిస్తాన్ లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తిరస్కరించింది. దీనితో లాహోర్‌లోని జమాన్ పార్క్‌కు భారీ పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్ తర్వాత పాకిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇమ్రాన్‌ను లాహోర్ హైకోర్టుకు హాజరుపరచకుంటే అరెస్టు చేయాలని పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.