ఏపీ రైతుల్లో భయం.. భారీ వర్షాలు కురుస్తాయని.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ రైతుల్లో భయం.. భారీ వర్షాలు కురుస్తాయని..

November 21, 2022

ఆంధ్రప్రదేశ్ వరి రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. బంగాళాఖాతంలో లేచిన వాయిగుండం ప్రభావంతో దక్షణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అప్రమత్తం చేశారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తున్నాయని, జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వైజాగ్, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ఒకటో నంబరు హెచ్చరికను జారీ చేశారు.

వాయుగుండం సోమవారం అర్ధరాత్రి దాటాక తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా. మంగళవారం ఉదయానికి దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తర తమిళనాడుకు సమీపంగా వచ్చే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఒక మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, శ్రీహరికోట, తిరుపతి, చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో వానలు కురిసే అవకాశముందని అంచనా. కోతల సమయంలో వానలు కురిస్తే చేతికందిన పంటి నీట మునుగుతుందని రైతులు ఆందోళనపడుతున్నారు.