బయటికి రావొద్దు.. హైదరాబాద్ వాసులకు హెచ్చరిక..  - MicTv.in - Telugu News
mictv telugu

బయటికి రావొద్దు.. హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. 

September 25, 2019

హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తుతోంది. దాదాపు నగరమంతా కుండపోత వాన కురుస్తోంది. మరో రెండు గంటలపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం 2 గంటలపాటు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని పోలీసులు, జీఎహ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. 

Hyderabad.

 హయత్ నగర్, చాదర్ ఘాట్, మలక్ పేట్,  ఫిల్మ్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్‌ పేట, ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, , సైదాబాద్‌, సంతోష్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఫలితంగా రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. మాదాపూర్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ముందస్తు జాగ్రత్తగా నగరంలో 13 రెస్క్యూ టీమ్‌లను అప్రమత్తం చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో జోనల్‌, డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీర్లు రోడ్లు, నాలల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి, తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ ఆదేశించింది.