నగరంలో నడిరాత్రి వరకు ఒకటే వాన... - MicTv.in - Telugu News
mictv telugu

నగరంలో నడిరాత్రి వరకు ఒకటే వాన…

August 25, 2017

హైద్రాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి 11 గంటల వరకు భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు చెప్తున్నారు. నిన్నటి నుండి వెదర్ మారుతూ వచ్చింది. శుక్రవారం సాయంత్రం నుండి వర్షం స్టార్ట్  అయింది. హైద్రాబాద్ లోని రోడ్లన్నీ  జలమయం అయ్యాయి. లోతట్టు ఏరియాల్లో నీళ్లు నిలిచిపోయాయి.

నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, మదాపూర్, కూకట్ పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్,  కోఠి, ఉప్పల్,  ఎల్బీనగర్,  మలక్ పేట్ ఏరియాలో భారీ వర్షం  కురిసింది. రోడ్లపై  నీళ్లునిలిచి పోవడంతో చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జాం అయింది.  మరో రెండురోజుల పాటు వర్షాలు కురుస్తే గనుక  మన రాష్ట్రంలోని చెరువులన్నీ నిండిపారడం ఖాయం.