హైదరాబాద్‌లో వాన బీభత్సం.. ఇవీ సీన్లు  - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో వాన బీభత్సం.. ఇవీ సీన్లు 

September 16, 2020

heavy rain in hyderabad down pour    heavy rain,  hyderabad, down pour, water logged, city police, traffic jam

భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమైంది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నిత్యం వాహనాల రద్దీతో కనిపించే రోడ్డు గుర్తుపట్టని విధంగా మారిపోయాయి. అత్తాపూర్, టోలిచౌకి, గుడిమల్కాపూర్, ఉప్పరపల్లి, లంగర్ హౌస్,  మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, తదితర ప్రాంతాలు వరద బాధిత ప్రాంతాలుగా మారిపోయాయి. ద్విచక్రవాహనాలు నీటి కొట్టుకుపోయాయి. వాటిని కాపాడుకోడానికి జనం నానా తిప్పలూ పడ్డారు. రోడ్డులో వెళ్లడమే వీలు కాలేదు. మ్యాన్  హోళ్ల భయంతో కొందరు రోడ్లపైనే ఆగిపోయారు. 

వర్ష బాధిత ప్రజలు వీడియోలు తీసి సీఎంకు, మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తున్నారు. నగరంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.