Heavy rain in Hyderabad Saturday evening, GHMC alert
mictv telugu

హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లన్ని జలమయం

July 2, 2022

Heavy rain in Hyderabad Saturday evening,  GHMC alert

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తోన్న వానకు రహదారులన్నీ జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని కూకట్‌పల్లి, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, నిజాంపేట్‌, బాచుపల్లి, జీడిమెట్ల, సూరారం, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, బేగంపేట్, ప్యాట్నీ, ప్యారడైజ్, అల్వాల్, జవహర్ నగర్, బాలానగర్, సుచిత్ర, కుత్బుల్లాపూర్, కీసర, నేరేడ్‌మెట్‌, కాప్రా, హెచ్‌బీ కాలనీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్ఐసీసీ ప్రాంగణం వద్ద ఎడతెరిపి లేని వాన పడుతోంది.

ఒక్కసారిగా మొదలైన భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మెట్రో పిల్లర్ల కింద తలదాచుకుంటున్నారు. రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. రోడ్లపై వరద నీరు నిల్వకుండా చర్యలు ముమ్మరం చేస్తున్నారు.