హైదరాబాద్ ను కమ్మేసిన మబ్బులు  - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ ను కమ్మేసిన మబ్బులు 

September 6, 2017

నిన్న గణేశ్ నిమజ్జనం దాదాపు పూర్తైందో లేదో  అందరు మంచిగ  రెస్ట్ తీస్కొని ఓ కునుకు తీసి పడుకున్నరు. ఇగ పొద్దుగల్ల లేసి సూశెవర్కు ఎటు జూస్నా మొత్తం చీకటి. కొందరైతే ఇంకా తెల్లారలేదేమో అన్కున్నరు. కనీ టైం జూసెవర్కు అర్థమైంది. బైటికచ్చి సూస్తె ఏమున్నది మొత్తం ఆకాశాన్ని మబ్బులు కమ్మేసినయ్. ఎక్కడ జూసిన తుప్పురు తుప్పురు వాన, వాతావరణం మొత్తం డల్ అయ్యింది. ఇంట్లో ఉన్నా..బయటకు వచ్చినా లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి

హై అలర్ట్

కమ్మేసిన మబ్బుల్ను సూసెవర్కు వాతావరణ శాఖోళ్లకు మొత్తం అర్థమైంది. రానున్న 48 గంటలు కుండపోతగ వర్షం కురుస్తదని అందరు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.ఈదురు గాలులు గుడ బాగనే పెడ్తయట. అయితే రాయలసీమ, తెలంగాణ ల మీదుగా పోతున్న ఉతరితల ద్రోణి దీనికి కారణమట. లోతట్టు ప్రాంతాల వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇగ ట్రాఫిక్ పోలీసోళ్లు గుడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలు తీస్కుంటున్నరు. ఏదన్న అర్జంట్ పనుంటనే  బైటికి రండి, లేకపోతే  జోరు వానల లేనిపోని ఇబ్బందులు ఎదుర్కుంటరు అని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలల్ల  పొట్టు పొట్టు వానలు కొడ్తున్నయ్. ఈదురుగాలులు వీస్తుండటంతో పలు ప్రాంతాల్లో కరెంట్ గుడ కట్ జేసిన్రు. లోతట్టు ప్రాంతాలు నీటమునిగి, ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షానికి నగరంలోని పలు ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించిన్రు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం ధాటికి గౌరంవాగు పొంగిపొర్లుతోంది. వరద ఉధృతికి బైపాస్ రోడ్డు తెగిపోవడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.