Heavy rain lashes several parts of Hyderabad
mictv telugu

హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి!

September 7, 2022

హైదరాబాద్‌ నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని మెహిదీపట్నం, గోషామహల్‌, మంగళ్‌హాట్‌, ఆసిఫ్‌నగర్, జియాగూడ పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్‌, బేగంపేట, అల్వాల్‌, చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడుపల్లిలో ప్రాంతాల్లో వర్షం పడుతోంది.

ఏకధాటిగా కురిసిన వానతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసుల నుంచి ఇంటికి తిరుగు పయనమైన వారంతా వానలో తడిసిముద్దయ్యారు. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద నీటి వల్ల పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసు అధికారులు ట్రాఫిక్ ను నియంత్రించారు.